వర్ణిస్తున్నాడు. రాజవిద్యా రాజ గుహ్యాలని పేరు పెట్టినా ఇవి ఆ జ్ఞాన విజ్ఞానాలకు మారు పేర్లే. జ్ఞానమే విద్య. విజ్ఞానమే గుహ్యం. అది కూడా మిగతా విద్యల లాంటిది కాదు కాబట్టి రాజవిద్య అన్నారు. మిగతా రహస్యాల వంటిది కాదు గనుక రాజ గుహ్య మన్నారు. గుహ్యమంటే రహస్యమే. రహస్యమంటే అనుభవమే. విజ్ఞానం అనుభవమే గదా. అనుభవ మెప్పుడూ రహస్యంగానే ఉంటుంది. వాడికి తప్ప మరెవరికీ తెలియదు. అందరికీ తెలిసేది కాదు అనుభవం. భోజనం చేస్తే తృప్తిగా ఉంటుంది. అది నీ అనుభవం. అది నీకే గాని ఇతరులకు తెలిసేది కాదు. కాబట్టి అది రహస్యమే.
అందులోనూ బ్రహ్మ జ్ఞానం కాబట్టి రాజవిద్య. బ్రహ్మానుభవం కాబట్టి రాజగుహ్యం. ఎందుకంటే జ్ఞానాలు మన మార్జించేవి ఎన్నో ఉన్నాయి. లోక జ్ఞానముంది. శాస్త్రజ్ఞాన ముంది. సంగీత సాహిత్యాది కళా జ్ఞానముంది. ఆఖరుకు ధర్మ జ్ఞాన Regious sense ముంది. అది కర్మజ్ఞానం కావచ్చు. దేవతాజ్ఞానం కావచ్చు. లేదా సగుణ జ్ఞానమే కావచ్చు. అదంతా ధర్మజ్ఞానం క్రిందికే వస్తుంది. అదేగదా ఇంతవరకూ జరిగిపోయిన అధ్యాయం మన కేకరువు పెడుతూ వచ్చింది. పోతే ఇది అలాటి సగుణ జ్ఞానం కంటే కూడా గొప్ప జ్ఞానం. అది సాపేక్ష మైతే Relative ఇది నిరపేక్షం Absolute. కనుకనే అది విద్య అయితే ఇది దానికన్నా శ్రేష్ఠమని చెప్పటం కోసం రాజవిద్య అని పేర్కొన్నది గీత. అలాగే అది ఉపాసకుడికి మాత్రమే అనుభవ గోచరం కాబట్టి రహస్యమైతే కావచ్చు. కాని సర్వమూ
Page 178