9. రాజ విద్యా రాజ గుహ్య యోగము
ఇంత వరకూ అక్షర పరబ్రహ్మ యోగం చెప్పుకొన్నాము. పోతే ప్రస్తుతం తొమ్మిదవ దైన రాజ విద్యా రాజగుహ్య యోగమనే అధ్యాయంలో ప్రవేశించాము. అక్షర పరబ్రహ్మ యోగం జోడు గుఱ్ఱాల స్వారిగా సాగిపోయింది. కొంత దూరం జ్ఞానమనీ కొంత దూరం ధ్యానమనీ మరికొంత దూరం జ్ఞాన ధ్యానాలనీ - చివరకు మరలా ధ్యానమనీ ఇలా ఒకదాన్ని మార్చి ఒకటి రెండు యోగాలూ సాగుతూ వచ్చాయి. చివరకు సగుణ ధ్యానంతో దాని ఫలశ్రుతితో సమాప్త మయింది అధ్యాయం. అంతకు ముందు అధ్యాయ మలా కాదు. జ్ఞాన విజ్ఞానాలకే ప్రాధాన్యమిస్తూ సాగిపోయింది. కాగా ప్రస్తుత మీ నవమాధ్యాయంలో మరలా నిద్ర మేల్కొని గీతాచార్యుడు ధ్యానాన్ని పక్కన బెట్టి జ్ఞాన విజ్ఞానాలనే గట్టిగా పట్టుకొని
Page 177