పోవటమే గాక అన్నిటికీ మూలమైన పరమ పదాన్నే అందుకోగలడు. యజ్ఞ దాన తపః ఫలమూ దక్కుతుంది వీడికి. దాని కదనంగా కాలాంతర గమ్యమైన ముక్తి ఫలమూ దక్కుతుంది. ద్విగుణీకృత మైనది వీడికి కలిగే సిద్ధి.
ఏతావతా కర్మయోగులూ ధ్యానయోగులూ- సగుణ ధ్యాన యోగులూ ముగ్గురి వ్యవహారమూ తెలిసిపోయింది మనకు. కర్మణా పితృలోక ప్రాప్తి విద్యయా దేవలోక ప్రాప్తి. పోతే బ్రహ్మోపాసన వల్ల ఆ రెండు లోకాలూ దాటిపోయి చివరిదైన సత్యలోక ప్రాప్తే కలుగుతుంది. కలిగితే వీరిలాగా వారికిక పునరావృత్తి లేదు. బ్రహ్మ దేవుడితో పాటు నిర్గుణ ధ్యాన మభ్యసిస్తూ అది పరిపాకానికి వస్తే ఆయనతో పాటే పరబ్రహ్మ సాయుజ్యం పొందుతారు. అంటే అహం బ్రహ్మాస్మి అని తామే బ్రహ్మ స్వరూపుల మని గుర్తించి ముక్తు లవుతారు. అందుకే దీనిని క్రమముక్తి అని పేర్కొన్నారు వేదాంతులు.
ఇదీ సారాంశం.
అక్షర పరబ్రహ్మ యోగః సమాప్తః
Page 176