#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

మరలా ఆ వృత్తి అంటూ ఉండబోదు వాడికి. మరి ఈ సగుణ యోగ మా హాత్మ్య మెలాటిదో వర్ణిస్తున్నది గీత.

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థాన ముపైతి చాద్యమ్ - 28


  వేదా లేమిటి. ఆ వేదాలు బోధించిన యజ్ఞయాగాదు లేమిటి. అలాగే తపస్సులూ దానాలూ ధర్మా లేమిటి. ఇవన్నీ సత్కర్మలే. సందేహం లేదు. అయితే వీటి నాచరించే టప్పుడు వైగుణ్యం Defect రాగూడదు. సాద్గుణ్య perfect ముండాలి. అలా ఏ లోపమూ లేకుండా వీటి నాచరిస్తే మంచిదే. వాటికి దగిన పుణ్యఫలం ప్రదిష్టం. పుణ్యకర్మలు కాబట్టి వీటన్నిటికీ పుణ్యఫల ముండి తీరుతుంది. మరణానంతర మది అనుభవించటాని కాయా పుణ్యలోకాలకు వెళ్లే అర్హత కూడా ఏర్పడుతుంది కర్మిష్ఠులకు.

  అయితే తత్సర్వం అత్యేతి. వాటివల్ల ఎంత పుణ్య ఫలం పోగు చేసుకొంటారో కర్మిష్ఠులు దాని నంతటినీ దాటిపోతారు సగుణోపాసకులు. వీరింతకు ముందు చెప్పిన సప్త ప్రశ్ని నిర్ణయం ద్వారా బ్రహ్మ తత్త్వాన్నే సగుణంగా విదిత్వా గుర్తించి దాన్నే ధ్యానం చేస్తూ వచ్చారు యావజ్జీవమూ. సదా తద్భావ భావితులు. కాబట్టి దాని కనుగుణంగా యోగీ పరం స్థాన ముపైతి చాద్యం. వారందరూ పోగు చేసుకొన్న పుణ్య ఫలాన్ని అతిక్రమించి

Page 175

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు