#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

  సృతి అంటే మార్గం. ఏతే సృతీ - రెండున్నా యని చెప్పాము మార్గాలు. శుక్లం కృష్ణం. దేవ యానం పితృయాణం. అర్చిర్మార్గం. ధూమమార్గం. ఇవి రెండూ ఒకటి సాయుజ్యానికైతే ఇంకొకటి సంసారానికి దారితీస్తాయని గుర్తించాలి యోగి. జానన్ యోగీ న ముహ్యతి. అలా ఏది దేనికనే అవగాహన బాగా ఉండి అలాగే నడుచుకొన్న వాడైతే అలాటి యోగి ఎప్పుడూ తెలివి కోలుపోడు. ఏ మార్గ మవ లంబించినా తెలిసే అవలంబిస్తాడు. కాని కర్మ మార్గమైతే ఎంత తెలిసి పాటించినా దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ధ్యానమార్గమైనా దేవతోపాసన వరకే అయితే అది కూడా అంత ప్రయోజన కారి కాదు. ఆ తెలియట మొక తెలియటం కాదు. మరి ఏదైతే తెలివి అంటారు. తస్మా త్సర్వేషు కాలేషు యోగ యుక్తో భవార్జున. యోగ యుక్తుడయి ఉండాలి మానవుడు. యోగమంటే ఇక్కడ సగుణోపాసన. అది నిత్యమూ అభ్యసిస్తూ పోవాలి జీవితంలో. ఎప్పుడని. ఇప్పుడప్పు డని నియమం లేదు. సర్వేషు కాలేషు. సర్వకాల సర్వావస్థలలో అభ్యసిస్తుండాలి. అంటే సగుణంగా పరతత్త్వాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. అలా స్మరిస్తూ పోతే అవసానంలో తదాకారమైన వృత్తి తప్పకుండా నిలబడుతుంది. దాని బలంతో శుక్లమైన జ్యోతి ర్మార్గంలోనే ప్రయాణం చేస్తాడు. చివరకు కర్మిష్ఠుల పితృలోకం - దేవతోపాసకుల దేవలోకాలు కూడా గడచి అమానవుడైన ఒక దివ్య పురుషుడు దారి చూపుతుంటే పోయి బ్రహ్మ లోకమే చేరగలడు. అక్కడికి వెళ్లితే ఇక

Page 174

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు