ధూమో రాత్రి స్తధా కృష్ణః - షణ్మాసా దక్షిణా యనం
తత్ర చాంద్ర మసం జ్యోతి - ర్యోగీ ప్రాప్య నివర్తతే - 25
ఇది ఉపాసకులైన యోగుల వ్యవహారమైతే ఇక కేవల కర్మపరాయణులైన యోగుల గతి ఏమిటని అడిగితే వారి ప్రయాణం వర్ణిస్తున్నది గీత. ధూమమూ రాత్రీ రెండూ ఒకటే. అగ్నిహోత్రాలు చేసి చేసి దానివల్ల ధూమ మేర్పడితే అందులో దారి కనపడకుండా పోతే రాత్రి కాలాభిమానిని అయిన దేవతే వారికి దారి చూపుతూ పోతుంది. తధా కృష్ణః - అక్కడి నుంచి రెండవ దశ అందుకొంటారు. అది కృష్ణ పక్షం. తదభిమానిని అయిన దేవతే నంటారు గురువుగారు. షణ్మాసా దక్షిణాయనం అక్కడి నుంచి దక్షిణాయనం - అదీ ఆరుమాసాలే. కాలం కాదది. దేవతే. అక్కడినుంచి ఆ దేవత నడుపుతూ పోతే చాంద్రమసం జ్యోతి ర్యోగీ ప్రాప్య. చంద్ర లోకానికే పోయి చేరుతాడు కర్మయోగి. చేరి అక్కడ తత్సం బంధమైన భోగ మనుభవించి తత్్యత్ అది ఖర్చయి పోగానే కొంతకాలానికి ద్యుపర్జన్య పృధివీ పురుష యోషిత్తులనే పంచాగ్నులలో క్రమంగా ఆహుతి అయి నివర్తతే. మరలా ఈ కర్మభూమిలో వచ్చి పడతాడు. వాడిలాగా వీడి కనా వృత్తి లేదు. ఆ వృత్తి పొంద వలసిందే. తప్పదు. చంద్ర లోకానికే పితృలోక మని పేరు. అక్కడికి వెళ్లితే ఆవృత్తి తప్పదు. భువర్లోకం పితృలోక మనుకొంటే సువర్లోకం దేవలోకం. రెండింటిలోనూ ఆవృత్తి ఉంది జీవులకు. ఒక్క సగుణోపాసకుడికే ఆవృత్తి లేనిది.
Page 172