#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

దాని నధిష్ఠించి ఉన్న దేవత. అది దాటితే వచ్చే మూడవ భూమిక శుక్లః శుక్ల పక్షం. అంటే శుక్ల పక్షాన్ని అభిమానించే దేవత. ఆ తరువాత దాన్ని దాటి పోతే నాలుగవది ఉత్తరాయణం. అది ఆరుమాసాలు. అక్కడక్కడా మార్గభూత అయిన దేవతే నంటారు భగవత్పాదులు.

  పోతే ఆ తరువాతి భూమికలు భగవద్గీత చెప్పలేదు గాని ఆదిత్యుడని చంద్రుడని విద్యుత్తని చాలా చెబుతుంది ఉపనిషత్తు. అవి కూడా మార్గాలు కావు. మార్గరూపంలో ఉన్న ఆయా దేవతలే. వీరి కాతివాహికులని పేరు. అతి వాహన మంటే అంతకంతకు ముందుకు నడుపుతూ పోవటం. అలా చేయి పట్టుకొని తీసుకుపోయే వారు కాబట్టి ఆతివాహికు లయ్యారు వారు. మరణించిన ఈ జీవుడికి జ్ఞానం లేదు. క్రియాశక్తీ కుంటు పడుతుంది. కనుక నిద్రపోయే వాణ్ణి మోసుకు పోయిన ట్టెవరో ఒకరు మోసుకుపోవాలి. వారికి జ్ఞాన క్రియాశక్తులు రెండూ పని చేస్తుండాలి. వారినే దేవతలని ఆతివాహికులని పేర్కొన్నారు. కాగా వీరు విద్యుల్లోకం చేరేసరి కక్కడ ఒకడు తయారవు తున్నాడు. వాడు బ్రహ్మ లోకం నుంచి వస్తాడు వీరిని తీసుకెళ్లడానికి. అమానవః పురుషః అన్నారు వాణ్ణి. మానవులకూ దేవతలకూ కూడా విలక్షణమైన వ్యక్తి వాడు. వాడు వీరిని వెంట బెట్టుకొని పోతుంటే తత్ర ప్రయాతా గచ్ఛంతి - వెళ్లిపోతారట వీరు. వీరంటే ఎవరా వీరు. బ్రహ్మావిదో జనాః సగుణ బ్రహ్మోపాసకులు. ఎక్కడికి వెళ్లుతారు. బ్రహ్మ. సత్యలోకాధి పతి అయిన బ్రహ్మ దేవుడి దగ్గరికి.

Page 171

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు