#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

ఆ మార్గమూ దేవతే వాస్తవానికి. ఎందుకంటే దేశకాలాలు రెండూ జడపదార్ధాలు. అవి ఈ సాధకుణ్ణి ఎక్కడికీ తీసుకెళ్ళ లేవు. దేవత అంటే అది చేతనం కాబట్టి తీసుకెళ్ల గలదు. అది కాలాన్ని మార్గాన్ని కూడా అభిమానించే చైతన్యం. అంటే అదే వీడు వెళ్లే మార్గంగా వీడు వెళ్లే కాలంగా మారి వీణ్ణి పట్టుకు పోతుందని భావం.

  యత్ర కాలే త్వనా వృత్తి మావృత్తిం చైవ యోగినః ఏకాలంలో ఏ యోగి ఆ వృత్తి చెంది వెనక్కు వస్తాడో - ఏ కాలంలో ఎవడు ఆ వృత్తి చెందకుండా అక్కడే ఆగిపోతాడో తం కాలం వక్ష్యామి. ఆ కాలమేదో నేను వర్ణించి చెబుతాను. విన మంటున్నాడు భగవానుడు.

అగ్నిర్జ్యోతి రహశ్శుక్లః- షణ్మాసా ఉత్తరాయణం
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః - 24


  అగ్ని జ్యోతి రెండూ ఒకటే. కాలాభిమానిని అయిన దేవత. ఒకటి యావజ్జీవమూ హోమాది కర్మలు చేయటాని కధిష్ఠానమైనది. అది అగ్ని. మరొకటి దాని ఫలితంగా అవసానంలో ఈ సాధకుణ్ణి మార్గంలో నడుపుతూ పోయేది. జ్యోతిర్మార్గ మని అందుకే వచ్చింది దానికి పేరు. దేవయాన మన్నా అదే. దీవ్యతీతి దేవః వెలుగని అర్థం. భౌతికమైన వెలుగు కాదిది. చిద్రూపమైనది. అదే ధ్యానించాడు వీడు యావజ్జీవం. అదే వీడికి దారి చూపుతూ తీసుకు పోతుంది. జ్యోతి అనేది వీడికి మొదటి మజిలీ. అది గడిస్తే వచ్చే రెండవ మజిలీ అహః అహస్సంటే పగలని కాదు.

Page 170

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు