#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

అని పేరు వచ్చింది. అయితే దీన్ని ఎందుకింత గొప్ప చేసి ఏకరువు పెట్టటమంటే ఇతర మార్గ స్తు త్యర్ధః అని ఒక్క ముక్కలో కొట్టి పారేశారు భగవత్పాదులు. దీనికి భిన్నమైన జ్ఞాన మార్గమే అసలైన ఉత్తమ మార్గం ఇది కాదు అని తెలుసుకోండి ఎప్పటికైనా అని మనకు దానిమీద దృష్టి మళ్లటాని కంటాడాయన.

యత్రకాలే త్వనా వృత్తి- మావృత్తిం చైవ యోగినః
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతరభ - 23


  ఇంకా ఒకటుంది రహస్యం. యోగులలోనే రెండు తెగల వారున్నారు. కర్మిష్ఠు లున్నారు. ఉపాసకులున్నారు. వారు కర్మ యోగులైతే వీరు ధ్యాన యోగులు. వీరు కూడా దేవతోపాసకులు కారు. సగుణ బ్రహ్మోపాసకులు. ఇందులో కర్మిష్ఠులూ దేవతోపాసకులూ - వీరిద్దరికీ ఆవృత్తి తప్పదు. అంటే పితృలోకానికి వెళ్లిన కర్మ యోగులూ - దేవలోకాలకు వెళ్లిన ధ్యాన యోగులూ వెనక్కు రాక తప్పదు. కాగా సగుణో పాసకులకు మాత్రమే ఆవృత్తి లేదు. వారు వెనక్కు వచ్చే ప్రసక్తి లేదు వీరిలాగా. సత్యలోకానికి వెళ్లి అక్కడే నిర్గుణ ధ్యానం చేసి తద్వారా జన్మరాహిత్యమై అక్కడికక్కడే తరిస్తారు. ఇందులో ఆవృత్తి పొందే యోగుల కంటే అనావృత్తితో తరించే యోగులు మేలు రకమని చెప్పటం కూడా గీతా వివక్షితమేనని వ్రాస్తారు భాష్యకారులు.

  ఇప్పుడు వారిద్దరికీ తేడా చెబుతున్నది గీత. అది కాలమూ దేవతా మార్గమూ అని మూడు విధాలు. మూడని పేరే గాని ఆ కాలమూ దేవతే.

Page 169

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు