భక్తి. అనాత్మ రూపమైన భక్తి. మరి జ్ఞాని అయితే అలా భావించడు. వాడి కిదంతా హుళక్కే. వాడి భక్తి భక్తిగాని భక్తి. జ్ఞానానికి పర్యాయమది.
అది ఎలా ఉంటుందో భగవత్పాదులు వర్ణిస్తున్నారు. స భక్త్యా లభ్యస్తు.
వాడూ భక్తితోనే పట్టుకొంటాడా తత్త్వాన్ని. అయితే ఎలాటి భక్తో తెలుసా
అది. జ్ఞాన లక్షణయా అనన్యయా ఆత్మ విషయయా. జ్ఞాన లక్షణమైన భక్తి
అది. అది ఆ పరతత్త్వాన్ని నీకు అన్యంగా చూపదు. నీవలా చూడవు.
మరి ఎలా చూస్తాడు జ్ఞాని. అనన్యంగా ఆత్మస్వరూపంగా చూస్తాడట.
ఇదీ గురువుగారి మాట. అయితే వీటి రెండింటికీ ఇంత హస్తిమశ కాంతర
మున్నప్పటికీ అనన్యమైన ఈ జ్ఞాన మార్గాని కెదగ లేక దానికి దగ్గరగా
వస్తుందని భావించి యోగ మార్గంతోనే తృప్తి పడుతున్నారు చాలామంది.
వారుత్తములు కాకున్నా మధ్యమాధికారులని ఒప్పుకోవాలి మనం.
వారందరూ ప్రణవ మంత్రాన్ని ఆలంబనంగా చేసుకొని అందులోనే బుద్ధిని
ప్రవేశ పెడతారు. తద్వారా బ్రహ్మతత్త్వాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు.
దీని కుత్తర మార్గమని దేవయాన మని జ్యోతిర్మార్గ మని చాలా పేర్లున్నాయి.
ప్రస్తుతం దీన్ని వర్ణించ బోతున్నది భగవద్గీత. ఇక ఈ అధ్యాయం పూర్తి
అయ్యేవరకూ ఇదే వరస. ధ్యాన మార్గమే. శుద్ధమైన జ్ఞాన మార్గం కాదు.
కొంతకాల మలా ధ్యానమనే శిక్షణ పొందితే చివరకది జ్ఞానానికి దారి
తీసి ముక్తి ఫలాన్ని ప్రసాదిస్తుంది. దీనికి క్రమ ముక్తి అని పేరు. జ్ఞానంలాగా
సద్యోముక్తి గాదు. క్రమంగా ముక్తిని పొందుతాడు కాబట్టి క్రమముక్తి
Page 168