#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

ఉన్నాయి. అవి ఉన్నాయంటే లోకాంతరాలూ - అక్కడ భోగాలూ మరలా జన్మాంతరాలూ ఇవన్నీ కూడా ఉండక తప్పదు. అప్పుడు రావట ముంటుంది. పోవట ముంటుంది. కాని అదే జ్ఞానం విషయంలో అయితే ఇదంతా కేవల మాభాసేగాని వాస్తవం కాదు. అక్కడ లోకాలు లేవు. లోకాంతరాలు లేవు. దేవతలు లేరు. వారిచ్చే భోగ భాగ్యాలు లేవు. రాకపోకలు లేవు. అంతా అబద్ధమే. సర్వం లోపరుచుకొని ఉన్న బ్రహ్మ చైతన్య మొక్కటే వాస్తవం. అయితే ఇప్పు డలాంటి జ్ఞాని విషయంలో కూడా ఎందుకు వచ్చిందీ మాట అని అడిగితే ఇది వాస్తవమైన రాకపోకలుగా తీసుకోగూడదు మనం. ప్రాప్య అంటే పొందినదాన్నే పొందటం. ననివర్తంతే అంటే వదిలిందే వదిలిపోవటం. కొత్తగా పొందటమూ లేదు. కొత్తగా వదలటమూ లేదు. ఎప్పుడూ వదిలే ఉందీ ప్రపంచం. ఎప్పుడూ పొందే ఉన్నాము పరమాత్మ భావం. అజ్ఞానంలో పొంద లేదను కొన్నదాన్నే జ్ఞానంలో పొందినట్టు కనిపిస్తున్నది. అజ్ఞానంలో తగులుకొన్నట్టు కనిపించినదే జ్ఞానంలో వదిలిపోయినట్టు కనిపిస్తున్నదని చెప్పటమే ఇక్కడ వివక్షితం మహర్షికి. మరేమీ గాదు.

పురుష స్స పరః పార్థ - భక్త్యాలభ్యస్త్వనన్యయా
యస్యాంతః స్థాని భూతాని - యేన సర్వమిదం తతమ్ - 22


  జ్ఞాన ధ్యాన మార్గాలు రెండింటికీ ఉన్న తేడా ఎలాటిదో అది ఎంతటిదో ఇప్పుడింకా స్పష్టంగా తెలిసిపోతుంది మనకు. ధ్యానం

Page 165

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు