పరమాత్మ స్వరూపుడే వాడు. ఇక ఎక్కడికీ రాకపోకలు చేయ నక్కర లేదు. ఏ దేవతల మొహం చూడనక్కర లేదు. వారిచ్చే ఏ చిల్లర మల్లర భోగభాగ్యాలకో అఱ్ఱులు చాచ నక్కర లేదు.
అయితే ఒక్కమాట. ఇక్కడ యం ప్రాప్య న నివర్తంతే అని ఉందే ఆ మాట కేమిటి అర్ధం. ప్రాప్తి నివృత్తి అనే మాట ఎందుకు వచ్చింది. దేవలోకాలు ఆఖరుకు బ్రహ్మలోకమని చెప్పినా అక్కడికి రాకపోక లుండవచ్చు. ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అవన్నీ త్రిగుణాత్మకం. సాధకుడైన వాడి కన్యమైన వ్యవహారం. కాని ఇక్కడ అలా కాదు. పరమాత్మ సాధకుడైన జ్ఞాని కన్యం కాదు. అనన్యం. ఆయన కొకానొక లోకం స్థానమంటూ లేదు దేవతలకు లాగా. సర్వత్ర సర్వదా సర్వ పదార్ధాలనూ వ్యాపించి ఉన్న తత్త్వమది. అలాంటప్పుడు దాన్ని ప్రాప్య పొందటమనే మాట ఎందుకు వచ్చింది. నని వర్తంతే. పొంది మళ్లీ వెనక్కు రాడనే మాట ఎందుకు వచ్చిందని ప్రశ్న.
దీనికి సమాధాన మింతకు ముందు నుంచీ ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడూ అదే ఇవ్వ బోతున్నాము. వెళ్లటం తిరిగి రావటమని ఎక్కడైనా వేదాంత గ్రంధాలలో వినిపించిందంటే అది ఒకటి గాదు. రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి మనం. వాస్తవంగానే Actual వెళ్లిరావట మొకటి. మానసికంగా Notional మరొకటి. ధ్యాన విషయంలో అయితే అది వాస్తవమైన ప్రయాణం. ఎందుకంటే అక్కడ దేశకాల వస్తువులనే మూడూ
Page 164