తత్త్వం. తమాహుః పరమాం గతిం దానినే మానవు డెప్పటికైనా అందుకొనే ప్రకృష్టమైన స్థానమని శాస్త్రం వర్ణిస్తున్నది. అవిద్యారూపమైన అవ్యక్తాన్ని అందుకొని ప్రయోజనం లేదు. అసలు దాన్ని కొత్తగా అందుకోటం దేనికి. ఇప్పు డ విద్యలోనే గదా ఉన్నాము మనమంతా. అందే ఉన్నదది. ఇక అందుకొనే ప్రశ్నే ముంది. అయితే అందినా అందులోనే నిత్యమూ తిరుగుతున్నా సుఖం లేదెవరికీ. అంతకంతకు సంసార తాపత్రయాన్ని తెచ్చి నెత్తిన పడేసి అధః పాతాళానికి తీసు కెళ్లుతున్నది. కనుకనే దీనితో గాదు నీవు కుస్తీ పట్టవలసింది. పట్టినా సుఖం లేదు. మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే. నన్నే నాస్వరూపాన్నే తన స్వరూపమని ఎవడు భజిస్తాడో వాడే ఈ బందిఖానాలో నుంచి బయట పడతాడని అందుకే భగవానుడు మనలను హెచ్చరించింది.
కాబట్టి ఈ అవ్యక్తాన్ని పట్టుకొంటే దుర్గతే గాని పరమమైన సుగతి కాదు. సుగతి ఎప్పటికైనా పరమాత్మ అనే అవ్యక్తాన్ని పట్టుకొంటేనే. దాని విశేష మేమని అడిగితే చెబుతున్నాడు మహర్షి యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. కష్టపడి ఎప్పటికి గాని దాన్ని అందుకోగలిగితే చాలు. నని వర్తంతే - మరలా సంసార సాగరంలో వచ్చిపడే ప్రమాదమే లేదు. అలా పడే ప్రమాద మవిద్యలో ఉంటుంది గాని బ్రహ్మ విద్యలో ఎప్పటికీ ఉండబోదు. ఒక్కసారి దాన్ని చేరామంటే మరలా అక్కడి నుంచి వెనక్కు రావటమంటూ ఉండదు. అలా రాకుండా పోయేదే - తద్దామ
Page 162