తేడా ఉందంటారు భాష్యకారులు. పరమంటే దాన్నిమించి ఉన్నది. వ్యతిరిక్త మని అర్ధం. వ్యతిరిక్తమైనా కొంత సామ్యముండ వచ్చుగదా అని అనుమానిస్తారేమో నని అన్యమని ప్రయోగించాడు మహర్షి. అన్యమంటే విలక్షణం. దానికీ దీనికీ ఏమాత్రమూ పోలిక లేదని భావం. పైగా అది సనాతనమైన అవ్యక్తం. త్రికాలాలలోనూ నిలిచి ఉంటుంది. మరి ఈ అవిద్యారూపమైన అవ్యక్తమలా నిలిచి ఉండదు. విద్య ఉదయిస్తే తొలగి పోతుంది. సనాతనం గనుకనే ఆ బ్రహ్మ చైతన్యం సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అవిద్యాలాగా నశించేది గాదు. సమస్త భూతాలనూ వ్యాపించి ఉంది. భూతాలంటే అవి అచేతనాలే కాదు. చేతన పదార్ధాలు కూడా. ఆ పదార్ధాలు నశించినా వాటిని వ్యాపించిన ఆ బ్రహ్మ చైతన్యం నశించేది కాదు. భావాభావాలు రెండింటికీ అధిష్ఠాన Basis మది. ఆరోపితమైన నామరూపాలు నశిస్తాయి గాని దేనిమీద అవి వస్తూపోతూ ఉంటాయో అది పోదు. సముద్రం మీద పైకి వచ్చే తరంగ బుద్బుదాదులు వస్తూపోతున్నా సముద్ర జలమలాగే స్థావరంగా ఉన్నట్టు సర్వసాక్షియైన చైతన్యమూ స్థిరంగానే నిలిచి ఉంటుంది.
అవ్యక్తో 22 క్షర ఇత్యుక్త - సమాహుః పరమాం గతిం
యం ప్రాప్యన నివర్తంతే - తద్ధామ పరమం మమ - 21
ప్రస్తుత మీ అవ్యక్తమూ అక్షరమని వర్ణించామే అది అవిద్యా రూపిణి అయిన మాయా శక్తి కాదు. దానికి కూడా అశ్రయ భూతమైన పరమాత్మ
Page 161