పరస్త స్మాత్తు భావోన్యో వ్యక్తో 2 వ్యక్తా త్స నాతనః
యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి - 20
తస్మా దవ్యక్తా త్పరః అన్యః అవ్యక్తో భావః - రెండ వ్యక్తా లున్నా యిక్కడ. ఒక అవ్యక్త మవిద్యా లక్షణ మైనది. సమస్త ప్రాణుల జనన మరణాలకు హేతుభూత మైనది. మరొక అవ్యక్త మింద్రియాలకూ మనస్సుకూ కూడా అగోచర మైనది. అన్నిటికీ సాక్షిభూత మైనది. పరమాత్మ. ఒకటి ప్రకృతి. మరొకటి పరమాత్మ. మాయాశక్తి బ్రహ్మమని అర్ధం. రెండూ అవ్యక్తాలే. అంటే మనకు బయటపడి కనిపించేవి కావు. ప్రకటమైతే వ్యక్తం. ప్రకటం కాక గుప్తమైతే అవ్యక్తం. రెండూ ఎలా గుప్త మయ్యాయి. ఒకటి క్రియాశక్తి మరొకటి జ్ఞానశక్తి. జ్ఞాన స్వరూపుడు పరమాత్మ అయితే ఆయన నాశ్రయించి ఉన్నదాయన మాయా శక్తి. జ్ఞానమూ శక్తీ రెండూ నిరాకారమే. నిరాకార మైతే వ్యాపకం. అలాంటప్పు డది గుప్తం కాక ప్రకటమెలా అవుతుంది. ప్రకటమైతే అది ప్రపంచం. నిరాకారంగా ఉన్నంత వరకూ అవి వ్యక్తం కావు. అవ్యక్తంగా ఉండిపోతాయి. అవే నామరూపాత్మకంగా వ్యక్తమైతే దాన్నే మనం ప్రపంచమని చూస్తున్నాము. దానితో వ్యవహరిస్తున్నాము.
ఇందులో అవ్యక్తమైన మాయాశక్తి నిరాకారమైనా దానిపాటికది జడం. మరి నిరాకారమైన పరమాత్మ కూడా అవ్యక్తమే కాని జడం కాదు. శుద్ధ చైతన్యం. కనుకనే జడమైన అవ్యక్తం కంటే పరమూ అన్యమూ అది. పరమూ అన్యమూ అనే మాటలు పునరుక్తిగా కనిపిస్తాయి. కాని కొంచెం
Page 160