#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

ఆ ప్రజాపతికి అహస్సు. వీరి ప్రళయ మాయనకు రాత్రి. వీరి సృష్టి ఆయనకు పగలు. అంటే ఏమన్న మాట. ప్రాణులు తమ అజ్ఞాన వశాత్తూ జన్మిస్తుంటే ఆయన వీరిని సృష్టిస్తున్నట్టు - వీరు మళ్లీ అజ్ఞాన వశాత్తూ మరణిస్తుంటే ఆయన వీరిని సంహరిస్తున్నట్టూ మనం భావిస్తున్నాం. కేవలమిది మన భావనే. భావన అయినా దీన్ని వాస్తవంగానే జరిగినట్టు చేసినట్టు మనం నమ్ముతున్నాం కాబట్టి అలాటి భావన మనకున్నంత వరకూ ఈ సృష్టి ప్రళయాలు సత్యమే. పారమార్ధికంగా కాదు. వ్యావహారికంగా. ఇదీ ఇక్కడ మన మర్ధం చేసుకో వలసిన రహస్యం.

  ఇప్పుడు గీత మరొక ముఖ్య విషయం బయటపెట్ట బోతున్నది. అక్షరమని వర్ణించింది పరమాత్మ నింతకు ముందు. క్షరం కాని దేదో అది అక్షరమని కూడా పేర్కొన్నాం. అంతేకాక ఆ అక్షరాన్ని అందుకోటానికి కూడా మరొక అక్షర ముందని చెప్పింది గీత. అదేదో గాదు ఓంకారం. అదీ అక్షరమే ఇదీ అక్షరమే. అది ఉపేయమైతే End ఇది గాని నందుకొనే ఉపాయం Means. అయితే ఉపేయమే సత్యంగాని ఉపాయ మెప్పుడూ సత్యం కాదు. సత్యాని కది కేవల మొక సంకేతం. సంకేతం సత్యం కాకపోయినా సత్యాన్ని చెబుతుంది. కనుక దాని నక్షర మన్నట్టే దీన్ని కూడా అక్షరమని నిర్దేశించారు పెద్దలు. అంత మాత్రమే. ప్రస్తుతమీ అక్షరం ద్వారా అందు కోవలసిన అసలైన ఆ అక్షర మేమిటో దాని స్వరూపాన్ని వర్ణిస్తున్నారు వ్యాసభగవానులు.

Page 159

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు