#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

హఠాత్తుగా రావటం పోవట మంటూ ఉండదు. అలా శాస్త్రం చెప్పిందంటే అశాస్త్రీయమైన ప్రసంగమది. హేతువాదానికే మాత్రమూ నిలవదు. అప్పటి కవిద్యే జన్మకు కారణమని చెప్పినట్టయింది. అవిద్యా మూలంగానే జన్మిస్తున్నారు జీవులు మరణిస్తున్నారు. వారి జనన మరణాలకు వారి అజ్ఞానమే తప్ప సృష్టి కర్త ఎవరినీ తన పాటికి తాను నిరంకుశంగా సృష్టించటమూ లేదు. సంహరించటమూ లేదు. అలాగే అవిద్యాదులున్న వారే అలా జన్మిస్తూ మరణిస్తూ ఉంటారు గాని క్రొత్తగా ఎవరూ రారు పోరు. ప్రజాపతి కూడా అవిద్యాది దోషాలు లేని వారిని బలవంతంగా తెచ్చి ఈ కర్మ భూమిలో పడేయటం లేదు. మరలా ఇక్కడి నుంచి బలవంతంగా బయటికి త్రోసి వేయటం లేదు ఇంతకూ ప్రజాపతిది కాదీ దోషం ప్రజలదే. ఇదీ పరిష్కారం.

  కనుక భూత గ్రామ స్సఏవాయం - భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే. సమస్త భూతాలూ ఈ ప్రపంచంలోకి వస్తున్నాయంటే లయమయి పోతున్నాయంటే సఏవ. అంతకు ముందు జన్మలలో వచ్చినవే - మరలా వెళ్లి పోతుంటాయి. ఎప్పుడా వెళ్లిపోవటం. రాత్ర్యాగమే. రాత్రికాలంలో. ఎవరికది రాత్రే. బ్రహ్మదేవుడికి అంటే బ్రహ్మదేవుడి రాత్రే వీరి లయం లేదా వీరి లయకాలమే బ్రహ్మకు రాత్రి. ప్రభవ త్యహ రాగమే. మళ్లీ అహరాగమే. ఆయనగారు పగటి వేళ మేలుకొని కూచున్నాడంటే ప్రభవతి. ఈ జీవకోటి అంతా జన్మించ వలసిందే. లేదా వీరు జన్మించటమే

Page 158

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు