చేసిందని భావిస్తున్నాము కాబట్టి వ్యావహారికంగా ఇందులో వచ్చి పడ్డాము మనం. కాగా ఇదంతా కేవలం వ్యావహారికమే గాని పారమార్ధికం కాదని దీనిమీద వైరాగ్యాన్ని మనకు నూరిపోసి వాస్తవమేదో దానివైపు మన దృష్టిని మళ్లించటానికే ఈ వర్ణన అంతా. అంచేత ఇక్కడ ప్రజాపతి ఏమిటా ఇంత దారుణంగా నిరంకుశంగా సృష్టి చేశాడు ఎందుకా మనలనింత బాధ పెడుతున్నదీ సృష్టి అని మన ములిక్కి పడ నక్కర లేదు. కేవల మాభాసే గనుక దీనిమీద విరక్తి చెంది సత్యమైన పరతత్త్వం మీద రక్తి పెంచుకోటమే సాధకులుగా మనం చేయవలసిన పని. అంతకన్నా ఏమీ లేదు. ఇదీ భాష్యకారుల పరిష్కారం.
భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే
రాత్రాగమే 2 వశః - పార్థ - ప్రభవ త్యహ రాగమే - 19
ఇదంతా సఏవ అవశః అని వ్యాస భగవానుడు వాడిన రెండు మాటల నాసరా చేసుకొని భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం. సఏవ అంటే ఇంతకు ముందు కల్పంలో జన్మించి మరణించిన ప్రాణులే మరలా జన్మిస్తున్నారని అర్ధం. అలాగే అవశః అంటే ఎందుకలా జన్మిస్తున్నారు. వారి అవిద్యాకామ కర్మలే దానికి కారణమని అర్ధం. అంటే ఏమన్న మాట. క్రొత్తగా ఎవరూ ఎక్కడి నుంచీ ఊడి పడటం లేదు. నిష్కారణం గానూ జన్మించటం లేదు. మొదటి నుంచీ అవిద్యాది దోషాలు వదలకుండా వస్తూ ఉన్న జీవులే వస్తుంటారు - పోతుంటారు గాని అది లేని వారెవరూ
Page 157