అలాగే శాస్త్రం మనకు బంధ మోక్షాలు చెబుతున్నది. అందులో బంధ మనేది మన మను భవిస్తూనే ఉన్నాము. మన అనుభవంలోనే ఉన్నదది. సమస్య ఎప్పు డనుభవంలో ఉన్నదో దానికి పరిష్కారం కూడా ఉండి తీరాలి. అయితే సమస్యే తెలుసుగాని మనకు పరిష్కారం తెలియదు. సమస్య బంధమైతే పరిష్కారం మోక్షం. మన కనుభవంలో లేని మోక్షమనే పరిష్కారం శాస్త్రం మనకు బోధిస్తున్నది. వ్యాధిగ్రస్తుడు చికిత్స చేసుకొని ఎలా వ్యాధి నుంచి విముక్తి పొందాలో అలాగే శాస్త్ర ముపదేశించిన మోక్ష మార్గాన్ని సాధించి మనమీ సంసారమనే వ్యాధి నుంచి బయటపడాలి గదా. అలా బయటపడే మార్గం శాస్త్రం మన కుపదేశించా లంటే దాని కవకాశం లేకపోతే ఎలాగా. ఉంటేనే శాస్త్రోపదేశానికి సార్ధక్యం. లేకుంటే అరణ్యరోదన మది. ఇందులో వ్యాధీ మనదే దాన్ని పోగొట్టుకొని బయటపడటమూ మనదే గాబట్టి ప్రజాపతికి లేదిందులో కర్తృత్వం. ప్రజలదే. ప్రజలు సంసార సమస్యను పరిష్కరించు కోటానికి సుముఖత్వం చూపితే ప్రజాపతి ఇంకా దానికి తగిన మార్గం వారికి స్ఫురింప జేస్తాడే గాని నిరంకుశంగా ఏదీ తన పాటికి తాను చేయటం లేదు.
పోతే అస అదంతా అలా ఉంచి వాస్తవాన్ని గురించి ఆలో చించేట్టయితే ఆ బ్రహ్మ ఈ సృష్టి చేయనూ లేదు. సంసార మనేది ఏర్పడనూ లేదు. జీవులనే వారొకరు లేనూ లేరు. వారీ సంసార బంధ మను భవించటమూ లేదు. అంతా వట్టిదే. పారమార్ధికంగా ఏదీ జరగలేదు. చేయలేదు. కాని అలాటి జ్ఞానం లేక అజ్ఞాన వశాత్తూ ఇదంతా జరిగింది
Page 156