అయితే ఇప్పుడొక పెద్ద ఆ శంక. బ్రహ్మ దేవుడి ద్వారానే ప్రాణుల సృష్టి ప్రలయాలు జరుగుతున్నా యంటే అప్పటి కాయనదే బాధ్యత గాని మనదేమీ లేదన్న మాట. అలాంటప్పుడు మనమిక సాధన చేయవలసిన అవసర మేముంది. తద్వారా మోక్ష పురుషార్ధాన్ని సాధించాలని శాస్త్రం మనకు బోధించటంలో అర్థ మేముందని ప్రశ్న. దీనికి వ్యాస భట్టారకుని తరఫున భగవత్పాదులు ముందుగానే సంజాయిషీ ఇస్తున్నారు. మూడున్నాయట ముఖ్యమైన అంశాలు మనమిక్కడ గ్రహించ వలసినవి. ఒకటి అకృతా భ్యాగమ కృత విప్రణాశాలనే దోషానికి పరిహారం. రెండు బంధ మోక్షశాస్త్ర ప్రవృత్తికి సాఫల్యం. మూడు సమస్త భూతాలు మాటి మాటికీ అవే సృష్టి అవుతూ అవే లయ మవుతున్నా యని చెప్పబోతారు కాబట్టి సంసార మంటే విరక్తి ఏర్పడటం. ఈ మూడు ప్రయోజనాల కోసం దీన్ని ఇలా వర్ణించవలసి వచ్చిందని సమర్ధిస్తా రాయన. అది ఎలాగో కొంచెం విమర్శించి చూద్దాం. అకృతాభ్యాగమ కృత విప్రణాశ మంటే మనం చేయనిది వచ్చి నెత్తిన పడటం చేసింది ఫలితం లేకుండా పోవటం. వర్తమాన జన్మనే ఒప్పుకొంటే అలాటి ఇబ్బంది వస్తుంది. పూర్వం చేసుకొంటేనే దాని ఫలితం కష్టమో సుఖమో ఇప్పుడను భవిస్తాము. ఇప్పుడు చేసుకొన్నది మరలా ఉత్తరత్రా జన్మ ఉంటేనే అనుభవించటాని కాస్కారం. కనుక నిరంకుశంగా సృష్టించటం లేదు ప్రజాపతి. ప్రాణుల కర్మ ఫలాని కనుగుణంగా జన్మ ఇస్తున్నాడు వారికి.
Page 155