బ్రహ్మ దేవు డప్పుడు మేలుకొంటాడు. మేలుకొని సృష్టిస్తాడీ ప్రపంచాన్ని. ఎలాగా. అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవంతి. బ్రహ్మ దేవుడి నిద్రావస్థకు అవ్యక్తమని పేరు. అప్పుడీ స్థావర జంగమా లేవీ వ్యక్తమయి కనపడవు. ఆయన ఎప్పుడు మేలుకొని సృష్టి కుప క్రమిస్తాడో అప్పుడా అవ్యక్త దశ నుంచి వ్యక్తులన్నీ జన్మిస్తాయి. స్థావర జంగమాలకే వ్యక్తులని పేరు. అవి జన్మిస్తాయంటే అర్థం అవ్యక్తమైన దశ నుంచి వ్యక్తం కావటమే జన్మ. నాసతో విద్యతే భావః అని గదా గీతావాక్యం. అంతకుముందు లేని పదార్ధ మెప్పుడూ రాదు. కాబట్టి జన్మ కాదిది. అభివ్యక్తి Manifestation అన్నారు భగవత్పాదులు.
రాత్ర్యాగమే ప్రలీయంతే త ధైవావ్యక్త సంజ్ఞకే. మరలా ఆ బ్రహ్మ దేవుడి స్వాపకాల మెప్పు డేర్పడుతుందో అప్పుడీ వ్యక్తమైన స్థావర జంగమాలన్నీ అవ్యక్తమైన ఆయన నిద్రావస్థలోనే లీనమయి కనపడకుండా పోతాయట. అప్పటికి బ్రహ్మ మెలకువే ప్రాణుల సృష్టి. ఆయన నిద్రే ప్రాణుల లయం. అది సమష్టి చైతన్యమైతే మనది వ్యష్టి చైతన్యం. అది సమష్టి ప్రాణమైతే మనది వ్యష్టి ప్రాణం. సమష్టి జ్ఞాన క్రియా శక్తియుత మైన తత్త్వానికే హిరణ్య గర్భుడు ప్రజాపతి లేదా బ్రహ్మదేవుడని పేరు. దానికేది అహా రాత్రాలో అందులోనే చేరిపోతాయి మనబోటి జీవకోటి ఆవిర్భావ తిరోభావాలు. సూర్యప్రకాశంలో చిన్న చిన్న దీపాలు ప్రకాశిస్తున్నా అవన్నీ దాని ప్రకాశంలో ఎలా చేరిపోతాయో అలాగే ఇదీ.
Page 154