లేదు. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఉన్నంత కాల మధికారంలో ఉంటాడు. గడువుతీరితే తానూ తీరిపోతాడు. అయితే పదవి అలాగే ఉంటుంది. మరొక కలెక్టరా పదవికి వచ్చినట్టే ఇంకొక బ్రహ్మదేవుడు తయా రవుతాడా పదవికి. వాడూ కొంతకాల ముండి పోవలసిందే. ఇదే ఆ వృత్తి అంటే. ఆవృత్తేగాక అనావృత్తి ఎలా అనిపించుకొంటుంది. సగుణమంటేనే వృత్తి తప్పదు. అనావృత్తి అనిపించు కోవాలంటే గుణాతీత మైతేనే గాని అనిపించు కోలేదు. అది బ్రహ్మ దేవుడు కాదది బ్రహ్మం.
అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః - ప్రభవం త్యహరాగమే
రాత్రాగమే ప్రలీయంతే - తత్రైవా వ్యక్త సంజ్ఞకే - 18
బ్రహ్మదేవుడికే ప్రజా పతి అని మరో పేరు. ప్రజాయంతే ఇతి ప్రజాః - అసంఖ్యాకంగా నిరంతరమూ జన్మిస్తూ పోయే వారెవరో వారు ప్రజలు. స్థావర జంగమాత్మకమైన సృష్టి. దీనికి పతి అంటే మూలపురుషు డెవడో వాడు ప్రజాపతి. ఆయనకూ మనలాగే జీవిత ముందని చెప్పాము. మనది తాత్కాలికమైతే ఆయనది అతి దీర్ఘకాలికమైన జీవితం. ఆయన ఒక ఆధికారిక పురుషుడు Deputed by the almighty సృష్టి చేయటమనే అధికార మప్పగించా డాయనకు పరమాత్మ. ఆది కర్తా స భూతానాం బ్రహ్మాగ్రే సమవర్తత అని స్మృతి గ్రంధాలు చాటుతున్నాయి. భూత సృష్టి కతడే కర్త. వాటి సంహారానికి కూడా కర్త ఆయనే. మనలాగే పగలూ రాత్రీ రెండూ ఉంటాయని గదా చెప్పా మాయనకు. అందులో అహ రాగమే. ఆయనగారికి ప్రబోధ మేర్పడితే అది అహస్సు. ప్రబోధమంటే మెలకువ.
Page 153