#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

గడచి ప్రస్తుత మా బ్రహ్మ దేవుడు తన ద్వితీయ పరార్ధంలో ఉన్నాడు. అందుకే సంధ్యావందనం చేసే కర్మిష్ఠులు ఆద్య బ్రహ్మణో ద్వితీయ పరార్దే అని సంకల్పం చెప్పుకొంటుంటా రిప్పటికీ. కాగా ఇలాటి బ్రహ్మాయువులో సంవత్సరా లెలా ఉన్నాయో ఆ సంవత్సరానికి మాసాలూ ఆ మాసానికి వాసరాలూ దాని క హోరాత్రాలు కూడా ఉంటాయి గదా. అందులో సహస్రయుగ పర్యంత మహర్యద్భహ్మణో విదుః - ఒక వేయి యుగాలు గడిస్తే అది ఆయన దినంలో పగటి పరిమాణం. పన్నెండు గంట లనుకోండి. అలాగే రాత్రిం యుగ సహస్రాంతాం. మరి పన్నెండు గంట లాయన రాత్రి పరిమాణం. అప్పటికి బ్రహ్మకొక రోజు గడవాలంటే రెండు వేల యుగాలు గడచి పోవాలన్న మాట. మరి యుగాలంటే మనకు తెలుసు గదా. కృత త్రేతా ద్వాపర కలియుగాలు. ఒక్కొక్క యుగానికే ఎన్నో వేల సంవత్సరాలు చెప్పారు మనవాళ్ళు. అలాంటప్పు డిదంతా లెక్క చేస్తూ పోతే ఎంతకాలం పడుతుందో చూడండి ఆయన కొక రోజు గడవటానికి. దాని దామాషాతో ఊహించుకోవాలి మనమిక ఆయన ఆయుః పరిమాణం. ఇంతకూ చెప్పవచ్చేదే మంటే ఇదంతా అనంతమైన కాలాని కధీనమయిందే కాబట్టి బ్రహ్మ దేవుడి జీవితం కూడా పరిచ్చిన్నమే గాని పరిపూర్ణం కాదు. చక్రంలాగా పరిభ్రమిస్తున్న దెప్పుడూ ఆవృత్తి గాక అనావృత్తి ఎలా అవుతుంది. కలెక్టరు పోస్టులాంటిది బ్రహ్మదేవుడి పోస్టు. చేసినంత కాల ముద్యోగం చేస్తాడు. రిటైరైతే అతడు కలెక్టరూ కాదు. అతనికా డ్యూటీ

Page 152

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు