బ్రహ్మ తత్త్వాన్ని వర్ణిస్తూ వచ్చింది గీత. అలాటి బ్రహ్మమే తానయి పోయాడు కాబట్టి జ్ఞానికీ లేదు జనన మరణాది భయం. అభయం వై జనక ప్రాప్తోసి అని బృహ దారణ్యకం చెప్పినట్టు అభయమే జ్ఞాని కెప్పుడూ.
సహస్ర యుగ పర్యంత మహ ర్యదృహ్మణో విదుః
రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్ర విదో జనాః - 17
అయితే మరి బ్రహ్మ లోకంతో సహా లోకాలూ లోకవాసులూ అందరూ తిరిగి రాక తప్పదు వారికి కూడా ఆ వృత్తి ఉందన్నారే. దానికేమిటి కారణం. ఏమిటి అందులో ఉన్న ఉపపత్తి అని ప్రశ్న వస్తే దానికి సమాధాన మిస్తున్నది గీత. బ్రహ్మదేవుడని దేవతా జ్యేష్ఠుడని పేరేగాని ఆయనగా రున్న సత్యలోకం కూడా నిత్యం కాదు. అదీ అశాశ్వతమే. కారణం. కాల పరిచ్ఛిన్నత్వాత్ కాలం చేత అది కూడా పరిచ్ఛిన్నమయి Measured Limitted పోతున్న దంటున్నారు భాష్యకారులు. ఆ మాటే చెబుతున్న దిప్పుడు గీత.
కాల పరిమితి ఉంది బ్రహ్మలోకానికి. బ్రహ్మకు కూడా మనలాగే ఇంతకాల మాయుష్యమని లెక్క ఉంది. మనకు వంద సంవత్సరాలేతై ఆయనకూ వంద సంవత్సరాలే ఆయుస్సు. అయితే ఆ వంద మన వందను ఎన్నో వందలు వేలు లక్షలు పెట్టి గుణిస్తే వచ్చే వంద. అలాటి వందను రెండు యాభయులుగా విభజిస్తే మొదటి 50 పూర్వపరార్ధం రెండవ 50 ద్వితీయ పరార్ధమని పేర్కొన్నారు పౌరాణికులు. అందులో పూర్వపరార్ధం
Page 151