తత్త్వాన్ని అభ్యసిస్తే క్రమంగా గుణాత్మకమైన వ్యూహాన్ని దాటి బయటపడతారు. అంతవరకూ కర్మ భూమికి రాకపోయినా అక్కడికక్కడే మార్పనేది ఉంటూనే ఉంది కాబట్టి దాన్ని ఆవృత్తి అని పేర్కొన్నది గీత. మరి వారికి జన్మ ఏమిటంటారా. సగుణమైన జ్ఞానం నిర్గుణంగా మారాలి కాబట్టి అదే జన్మ. జ్ఞాన జన్మ. జ్ఞాన ముదయించిందో ఆ తరువాత ఇక జన్మే ఉండబోదు. అంతవరకూ భౌతికం కాకపోయినా జ్ఞాన జన్మ అయినా ఎత్త వలసిందే. కాబట్టి సత్యలోకం వరకూ దాన్నీ దానిలో నివసించేవారినీ అందరినీ కలుపుకొని ఆవృత్తి చెప్పవలసి వచ్చింది. ఇదీ ఇక్కడ మన మర్ధం చేసుకోవలసిన రహస్యం.
పోతే మరి ఇక బ్రహ్మలోకం వరకూ పోకుండా ఇక్కడే ఇహంలో జీవించి ఉండగానే నిర్గుణ జ్ఞాన మార్జించా డనుకోండి మానవుడు. అలాటి వాడే లోకానికీ వెళ్లనక్కర లేదు. అసలు వాడికి శరీరం లేదు. ప్రపంచం లేదు. ఒక సత్యలోకం లేదు. ఒక సగుణమైన ఈశ్వరుడూ లేదు. అంతా కలిపి బ్రహ్మ స్వరూపమే. అది సర్వవ్యాపకమైన ఆత్మ స్వరూపమే. వాడికా వృత్తీ అనావృత్తీ అనే ప్రసక్తి ఏముంది. అక్కడా జన్మించడిక్కడా జన్మించడు. మూ ముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని ఘాటుగా చాటుతున్నది గీత. అలాటి నిర్గుణ తత్త్వమే తన స్వరూపమని దర్శించేవాడి కిక జన్మ అనేదే లేదు పొమ్మంటున్నది. జన్మ లేదంటే మరణం లేదు. మరణం లేదంటే మార్పు లేదు. నజాయతే నమ్రియతే - అజమవ్యయం అని గదా
Page 150