#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

వెనక్కు రావటం. మిగతా లోకాలకు దేనికి వెళ్లినా వెనక్కు రావలసిందే మానవుడు. సత్య లోకానికి వెళ్లినవాడు మాత్రమలా రాడు. ఆవృత్తి లేదు వాడికనా వృత్తేనని శాస్త్రం చెబుతున్నది. ఎవడు వాడు. దేవతోపాసకుడు కాడు. వాడైతే మరలా కర్మ భూమిలో వచ్చి జన్మించ వలసిందే. కాని వీడు సగుణ బ్రహ్మోపాసకుడు. బ్రహ్మాన్ని సగుణంగా పట్టుకొని ధ్యానించినవాడు. వీడు మాత్రం రాడని శాస్త్రం ఘోషిస్తున్నది. అయితే ఏమయి పోతాడు. బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే - బ్రహ్మ దేవుడితో సహా ప్రలయకాలం దాపురించి నప్పుడు - పరస్యాంతే కృతత్మానః ప్రవిశంతి పరం పదం. బ్రహ్మకు ద్వితీయ పరార్ధం కూడా ముగిసిపోయి ఇక నిర్యాణ మయ్యేటప్పుడు ఆయనతో సహా సగుణోపాసకు లందరూ నిర్గుణ తత్త్వాన్ని అందుకొని తద్ద్వారా ముక్తులయి పోతారని శాస్త్రం.

  అలాంటప్పుడు బ్రహ్మలోకంతో సహా వెనక్కు రావటమేమిటి. భగవత్పాదులు కూడా అలాగే వ్రాస్తున్నారు. ఏమిటి దీని తాత్పర్యం. బ్రహ్మదేవుడంటే బ్రహ్మం కాదు. సగుణమైన బ్రహ్మం. దానికే కార్య బ్రహ్మమనీ శబ్ద బ్రహ్మమనీ శబల బ్రహ్మమనీ నామాంతరాలు. ఆయన ఒక వ్యక్తి. ఆయన దొక లోకం. అక్కడ ఆయనతో పాటు నిర్గుణ జ్ఞానాన్ని అభ్యసించే వారూ వ్యక్తులే. వీరంతా త్రిగుణాత్మకమైన క్షేత్రాన్ని ఇంకా దాటిపోలేదు. దాటాలంటే నిర్గుణ జ్ఞానముండాలి వీరికి. అంతవరకూ సగుణ జ్ఞానమే వీరిది. కనుక బ్రహ్మ దేవుడితో పాటు వీరందరూ నిర్గుణ

Page 149

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు