ఆ బ్రహ్మ భువనాల్లోకాః - పునరావర్తినో వార్జున
మాముపేత్యతు కౌంతేయ - పునర్జన్మ నవిద్యతే - 16
జ్ఞాన మార్గంలో ఒక్కదానిలోనే ఈ సౌలభ్యం మానవులకు. మరి దేనిలో గాదు. దేనిలో నంటే కర్మలో గాదు. భక్తిలో గాదు. సమాధిలో గాదు. ఆఖరు కింతకు ముందుగా వర్ణిస్తూ వచ్చిన సగుణోపాసనలోనూ గాదు. అవన్నీ పరమాత్మ నన్యంగా పరిచ్ఛిన్నంగా Limitted భావించే సాధన మార్గాలు. పరమాత్మ సాధ్యం కాదు becoming సిద్ధం being. త్రికాలాలలోనూ సిద్ధమైన వస్తువది. పైగా అనాత్మ కాదు object. సాధకుడి ఆత్మ subject స్వరూపమది. అలాంటప్పుడందులో గాక సౌలభ్యం మరి ఎందులో దొరుకుతుంది. సులభమూ శాశ్వతమూ అది. పోతే మిగతా సాధన ఏది చేసినా తద్ద్వారా ఎంత గొప్ప ఫలితాన్ని నీవు చవిచూచానని సంతోషించినా అది నీకు శాశ్వతం కాదు. శాంతి దాయకం కాదు.
ఆ బ్రహ్మ భువనా ల్లోకాః పున రావర్తినః - బ్రహ్మ లోకంతో సహా అన్ని లోకాలూ వెనక్కు రావలసిందే. తప్పదు. బ్రహ్మ దేవుడుండే లోకం బ్రహ్మ లోకం. దానికే సత్యలోకమని కూడా పేరు. ఊర్ధ్వ లోకా లేడింటికీ కడపటి లోకమది. భూలోకంతో ప్రారంభమై సత్యలోకంతో సమాప్త మవుతుంది ఊర్ధ్వలోకాల సంఖ్య. అలాంటి సత్యలోకంతో కూడా అన్నీ వెనక్కు వస్తాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఒక ఆశంక వస్తుంది. అనావృత్తి శ్శబ్దాత్తని బ్రహ్మసూత్రకారుడు పేర్కొంటున్నాడు. ఆ వృత్తి అంటే
Page 148