#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

నిశ్శేషంగా కాల్చి పారేసింది. అటు పూర్వజన్మలలో చేసుకొన్న సంచిత కర్మా కాలిపోయింది. ఇటు జన్మ అనేదే ఎత్త లేదు కాబట్టి ఆగామి కర్మ అసలు ఏర్పడటానికే ఆస్కారం లేదు. అసలు శరీర మనేది ఒకటి ఉంటే గదా జ్ఞానికి. ఏ కర్మ అయినా చేయటానికి. శరీరమే లేదు. ఎందుకని. సర్వమూ ఆత్మ స్వరూపంగా చూచే వాడి కజ్ఞాన మెక్కడిది. అజ్ఞానమే గదా కారణ శరీరం. కాబట్టి కారణ శరీరం లయ మయింది. కారణ శరీరముంటే మనః ప్రాణాలనే సూక్ష్మ శరీరానికి అస్తిత్వం. అదే లేకుంటే ఇది అసలే లేదు. మరి కారణ సూక్ష్మాలు రెండూ ఎగిరిపోతే ఇక స్థూల శరీరమెలా ఏర్పడుతుంది. అది అసలే అభావం. ఇలా శరీరమే లేనప్పుడు కర్మ కాధార మేమిటి. కర్మ లేకుంటే జన్మ ఏమిటి. అర్ధం లేనిమాట. అప్పటి కజ్ఞానికే కర్మ అయినా జన్మ అయినా. జ్ఞానికి జన్మ లేదు - కర్మా లేదు. అంతా గగన కుసుమం.

  అయినా జన్మించవచ్చు గదా కృష్ణ పరమాత్మలాగా. ఆయన నిత్యముక్తుడైనా జన్మించాడా లేదా. నిజమే. అది జన్మ కాదు. అవతారం. పేరులో ఏముంది. రెండూ ఒకటే గదా. కాదు. అజ్ఞానిది మాయాధీనం. జ్ఞాని ది మాయాతీతం. కనుకనే జన్మ కర్మచమే దివ్యమని చెప్పటం కృష్ణ భగవానుడు. మాయా శక్తిని వశీకరించుకొని వస్తాడు పరమాత్మ లోకంలోకి. తెలిసి వస్తాడు. అదే అవతారం. మరలా చేయవలసింది చేసి తెలిసి వెళ్లిపోతాడు. మరణం కాదది. నిర్యాణం. అయితే జ్ఞానిది కూడా అలాగే

Page 146

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు