#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

పరమాత్మ. ఆయన సౌలభ్యం వల్ల జ్ఞానికి కలిగే సిద్ధి ఏమిటి అది ఎలాటిది అని ప్రశ్న వచ్చింది. దానికిప్పుడు సమాధాన మిస్తున్నాడు. వ్యాస భట్టారకుడు. సంసిద్ధిం పరమాం గతః మామూలు సిద్ధి కాదది. సంసిద్ధి. అపరం కాదు పరమం. ఇంతవరకూ పరమాగతి పరమపదం పరమ పురుష అని ఏకరువు పెడుతూ వచ్చాడే గాని పరమ సిద్ధి అని ఎక్కడా చెప్పలేదు. ఇక్కడే వింటున్నామా మాట కొత్తగా. పరమసిద్ధి అంటే ఏదో గాదు. మోక్షం. దేనికన్నా ఇక గొప్ప సిద్ధి లేదో అది. అలాటి మహాఫలమైన మోక్షాన్నే గతాః పొందుతా రట జ్ఞానులు. ఎందువల్ల. మహా త్మానః మహాత్ములు జ్ఞానులంటే. పెద్ద ఆత్మనే పట్టుకొన్నారు. మహా అంటే అన్నిటికన్నా పెద్దది. దేహాత్మ కాదది. విజ్ఞానాత్మ కాదు. జీవాత్మ కాదు. చివరకు ప్రత్యగాత్మ కాదు. సర్వవ్యాపకమైన సర్వానన్యమైన పరమాత్మ. అందుకే అది మహాత్మ. అలాటి మహత్తమమైన ఆత్మే తమ ఆత్మగా దర్శించినవారు గనుక మహాత్ము లయ్యారు జ్ఞానులు. మహాత్ములు గనుకనే నిత్యముక్తుడైన పరమాత్మలాగా వారూ నిత్యముక్తులే.

  కారణం మాముపేత్య. పరమాత్మనే తమ స్వరూపమని వాటేసుకొన్నారు వారూ నిత్య ముక్తులే. అందులో ఆశ్చర్య మేముంది.

  ముక్తులెప్పు డయ్యారో ఇకవారికి జన్మ లేదు. పునర్జన్మ నాప్నువంతి. మళ్లీ జన్మ అనేది ఎత్తబోదు. జన్మించాలంటే కర్మ అనేది శేషించి ఉండాలి. మరి వారికి కర్మే లేదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. వారి జ్ఞానాగ్ని కర్మ లన్నింటినీ

Page 145

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు