గ్రహించలేక పోతున్నారు. గ్రహించలేక ఎందుకింత ధ్యానమనే కసరత్తు చేస్తున్నారని ప్రశ్న. దాని కిస్తున్నారు సమాధానం. నిత్యయుక్తస్య యోగినః వాడు నిత్యయుక్తుడూ కాదు. యోగీ కాదు. అందుకే అనవసరంగా గోటితో పోయే దానికోసం గొడ్డలి చేతికి తీసుకొంటున్నాడు. నిత్యమూ యుక్తుడైన యోగి అయితే ఇలాటి కసరత్తు చేయడు. యుక్తుడంటే సమాహితుడని అర్థం వ్రాశారు గురువుగారు. సమాధానమంటే ఏకాగ్రత. ధ్యానంలో కాదు. జ్ఞానంలో. ధ్యానంలో అయితే అన్య మవుతుందది. అనన్యం కాదు. అనన్యమని అన్నాడు కాబట్టి ధ్యానం కాదిది. జ్ఞానమే. జ్ఞాన మయి నప్పుడిక ఏకాగ్రత దేనిమీద నంటారు. అధిష్ఠానం మీదనే. ఆరోపితం మీద గాదు. ఆరోపిత మెక్కడి కక్కడ తెగిపోయే విశేషాలు. అధిష్ఠానమా విశేషా లన్నిటినీ సమానంగా వ్యాపించిన సామాన్య చైతన్యం. అది ఆత్మ స్వరూపమే కనుక దాన్నే నిత్యమూ దర్శిస్తుంటాడు కాబట్టి నిత్యయుక్తుడు జ్ఞాని. యోగినః - యోగి కూడా జ్ఞానే. జ్ఞానయోగి. ధ్యాన యోగి కాదు.
మా ముపేత్య పునర్జన్మ - దుఃఖాలయ మశాశ్వతం
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః - 15
మరి జ్ఞానయోగి అనండి. కొంతకాలం ధ్యానయోగి అయి తరువాత జ్ఞాన యోగిగా మారిన వాడనండి. అలాటి జ్ఞానయోగికి నేను సులభుణ్ణి వాడు నాకన్యం కాడు. వాడూ నేనూ ఒకటేనని హామీ ఇచ్చాడు గదా
Page 144