ఎక్కడికో బయలుదేరి పోయి అందుకో బని లేదు. ఎక్కడో దూరంగా నీ కన్యంగా ఉన్నదైతే అందితే అందుతుందది లేకుంటే లేదు. అందినా అందవచ్చు. లేకున్నా లేదు. గారంటీ ఇవ్వలేము. పైగా ఒకవేళ అందినా సుఖం లేదు. అది నీకెప్పటికీ అన్యమే. నీవు గాదది. నీది. పోతే ఇప్పుడీ ఆత్మ అనేది ఎక్కడో దూరం గాలేదు. నీకు అన్యమూ కాదు. ఎక్కడ బడితే అక్కడ నీ స్వరూపంగానే విస్తరించి ఉన్నది. సత్తాస్ఫూర్తులనే భావాలే గదా ఆత్మ. అది లేని చోటెక్కడ ఉంది. కాని పదార్ధ మెక్కడ ఉంది. అస్తి - అస్తీ తిస్ఫురతి. ఉంది ఉందని స్ఫురిస్తూనే ఉంటుందేదైనా. ఎక్కడైనా. అలాంటప్పుడు దుర్లభమెలా అవుతుంది. ఎంతైనా సులభం. చేయివేస్తే సోకుతుంది. ఆకాశంలాంటి దాత్మ.
ఆకాశమిప్పుడందు కోవాలంటే ఎక్కడికి వెళ్లి అందుకోవా లంటావు. నీవున్న దాకాశం కాకపోతేగదా. అసలు నీలోపలా వెలపలా అది లేకపోతే గదా. కేవలమిది ఆకాశమే గదా అనే భావన ఉంటే చాలు. దాన్ని అందుకొన్నట్టే. భౌతికంగా ఏ ప్రయత్నమూ లేదు. కేవల మాభావనే ప్రయత్నం. అలాగే చిదాకాశమైన conscious space ఆత్మ కూడా తద్భావ భావనే. అందులో కూడా ఆకాశం లాగా నీకు విషయం object కాదది. నీ స్వరూపమే subject నీవే. ఇక సులభమని వేరే చెప్పాలా. నేనేనని స్మరిస్తే సులభం. నాదని స్మరిస్తే దుర్లభం.
మరి అలా స్మరించ లేకపోతున్నా మంటే ఏమిటి కారణం. మామూలు మానవులే గాదు. ఉపాసకులైన పెద్దలు కూడా ఎందుకని
Page 143