అనన్యమే. ఇక తనకు భిన్నంగా ఏది పరమం. ఏది పురుషం - వెళ్ళి దాన్ని వాటేసు కోటానికి. పోతే ఇద్దరికీ స్మరణ తద్భావ భావనా దేహత్యాగమూ ఇవి మూడూ సమానంగానే వర్ణిస్తుంది గీత. అవి ఆత్మకైనా అన్వయించవచ్చు. అనాత్మ భావానికైనా అన్వయించవచ్చు. అది మాత్ర మిద్దరికీ సమానమే. మొత్తానికిదీ రెంటికీ ఉన్న వైధర్మ్యం ৯. Similarity and Dissimilatiry. ລ້ ລ້ చాలు వైధర్మ్య మెగిరిపోయి ఇద్దరూ సధర్ములే అవుతారు. ధ్యాని క్రమంగా జ్ఞానిగా మారుతాడు. ఆవిషయమే వర్ణిస్తున్నా డిప్పుడు వ్యాసభగవానుడు.
అనన్య చేతా స్సతతం యోమాం స్మరతి నిత్యశః
తస్యాహం సులభః పార్థ - నిత్యయుక్తస్య యోగినః - 14
అనన్య చేతాస్సతతం - ఎప్పుడూ పరమాత్మను తనకన్యంగా ఎక్కడో ఉన్నా డక్కడికి వెళ్లి అందుకోవాలని అనాత్మ రూపంగా గాక తన కనన్యమైన ఆత్మ స్వరూపుడేనని – యోమాం స్మరతి నిత్యశః - నిత్యమూ నన్నే ఎవడు స్మరిస్తుంటాడో వాడే జ్ఞాని. అంతకుముందు ధ్యాని అయి అన్యంగా భావించినా తరువాత అనన్యంగా భావించగలిగితే వాడు కూడా జ్ఞానే. ధ్యాని అనే పేరు తొలగిపోయి వాడి కప్పటి నుంచీ జ్ఞాని అనే ముద్ర పడుతుంది. ఇక జ్ఞానికీ ధ్యానికీ తేడా లేదు. ఇద్దరూ జ్ఞానులే.
అలాటి జ్ఞాని అనిపించుకోవాలే గాని తస్యాహం సులభః పార్ధ. వాడికి నేనెప్పుడూ సులభుణ్ణి. అంటే ఏమిటర్ధం. ఎంతో సాధన చేసి
Page 142