#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

సశరీరంగా చేయాలా ప్రయాణం. ఆ శరీరం స్థూలం కాకున్నా సూక్ష్మమైనది. మనసూ ప్రాణమూ ఇవే ఉంటాయి వాడికి. అవి నడుపుతూ ఉంటాయి చివరిదాకా. మరి జ్ఞాని కలా కాదు. మయ్యర్పిత మనోబుద్ధిః ఆత్మలోనే కరిగించి పారేశాడు తన సూక్ష్మ శరీరాన్ని జ్ఞాని. కాబట్టి కారణ శరీర మసలే లేదు. స్థూలమా ఇక్కడే పడిపోయింది. ఇక అశరీరుడైన జ్ఞాని ఎలా చేస్తాడు ప్రయాణం. ప్రయాణం కాదది. మరి యః ప్రయాతి మావేవైతి అన్నదే గీత దాన్ని ఎలా సమర్థిస్తారు. అన్నది మాట సామెతగా. అది ప్రయాణం గాని ప్రయాణం. పొందిన దాన్నే పొందటం. బాల్యం నుంచి యౌవనానికీ వార్ధక్యానికీ ప్రయాణం చేశామంటే చేశామా. వార్ధక్య దశ అందుకొన్నామంటే అందుకొన్నామా. అది చేసిందీ అందుకొన్నదీ మన శరీరం. మన మనస్సూ మహా అయితే. సాక్షిరూపమైన ఆత్మకాదు. అది ఆ దశ లన్నిటికీ మార్పు లన్నిటికీ సాక్షి. యాత్రికుడు కాదు. అలాగే ఇదీ. పోతే ఇక చివరకు చేరే స్థానం కూడా ధ్యానికి పరమపదం. పరమ పురుషః - అది వాడి కన్యమే గాని అనన్యం కాదు. కాకుంటే వీడూ పరిమితుడే. అదీ పరిమితమే. పరిపూర్ణమేదీ గాదు. జ్ఞాని విషయ మలా కాదు. వాడు అన్యభావనతో గాక అనన్య భావనతో గ్రహిస్తాడు. దాన్ని. అందుకే ధ్యాని ఆ పురుషుణ్ణి చేరుతాడనే వర్ణిస్తుంది గీత. ఆత్మను చేరాడని చెప్పదు. జ్ఞాని మాత్ర మాత్మనే పొందుతాడు గాని పరమ పదాన్ని పరమ పురుషుణ్ణి అని చస్తే చెప్పదు. అన్యమైతే గదా వాడికి. అంతా

Page 141

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు