పట్టుకో మరేదీగాదని భగవానుడి సలహా. పోతే ఉపాసకుడికి లక్ష్యమది గాదు. పరమం పురుషం దివ్యం - ఆదిత్య వర్ణం పరం పురుషం తత్తే పదం పరమాంగతిం - అని ఇలా ఆత్మకు భిన్నమైన అనాత్మ రూపాన్ని బోధిస్తుంది గీత. మామని ఎక్కడా చెప్పదు. పోతే లక్ష్యసాధన జ్ఞానికి స్మరణం తప్ప మరేదీ చెప్పదు గీత. చూచారో లేదో. ధ్యానికి మాత్రం స్మరణే గాక ధారణా ధ్యాన సమాధులు వాటి అభ్యాసమూ చాలా ఏకరువు పెడుతుంది.
పోతే సాధనకు కావలసిన సామగ్రి అంటూ ఏదీ లేదు జ్ఞానికి కేవలం స్మరణే. తన స్వరూపాన్ని తను గుర్తించటమే సాధన సామగ్రి. ధ్యానికి మాత్రం అలా గుర్తింపుతో సరిపోదు. దానికి ముందు చాలా ఉంది కలాపం. భక్తి ఉండాలి. యోగముండాలి. వాటితో మనసును నిశ్చలం చేసుకోవాలి. దాన్ని ప్రాణశక్తిలో ప్రవేశపెట్టి ఆ ప్రాణశక్తిని సుషుమ్న ద్వారా క్రమంగా సహస్రారం చేర్చుకోవాలి. ఆ తరువాత దాన్ని ఛేదించి బాహ్యంగా ఉన్న సూర్యనాడిలో దాన్ని ప్రవేశపెట్టి ఆ తరువాత బ్రహ్మలోకం దాకా ప్రయాణం చేయాలి. ఇంత ఉంది తతంగం. ఇలాటి కసరత్తు చేయవలసిన అవసరమే కొంచెమూ లేదు జ్ఞానికి.
పోతే ధ్యాని ఈ సామగ్రినంతా దగ్గర పెట్టుకొని చాలా దీర్ఘమైన ప్రయాణం చేయవలసి ఉంది తన గమ్యాన్ని అందుకోటానికి. అది దేశంలో కాలంలో జరగవలసిన ప్రయాణం. పైగా తాను కూడా అశరీరంగా కాదు.
Page 140