వర్ణిస్తాడు. చివరకు ధ్యాన వర్ణనతోనే అధ్యాయాన్ని ముగిస్తాడు. ఇలా రెండింటినీ కలగా పులగం చేసి వర్ణించటం మూలాన వ్యాస హృదయం ఇంతకూ ఏమిటో వివేచన చేసి తెలుసుకోటం కష్టమే. అక్కడక్కడ భాష్యకారులు వాటికి గల తేడా గొప్పగా విప్పి చెప్పినా దానిమీద భావన చేసి నేనెంతగా వివరిస్తూ వచ్చినా ఇంకా వినే శ్రోతలకు పూర్తిగా అవగాహనకు రాకపోవచ్చు. అందుకని ముందుకు సాగిపోయే ముందీ విషయం మనం కచ్చితంగా తేల్చుకోటం మంచిది. నాలుగైదు విషయాలలో తేడా ఉంది రెండింటికీ. ఒకటి జ్ఞాన ధ్యానాలకు రెండింటికీ ఉన్న లక్ష్యం. రెండు వాటి నందుకోటానికి చేసే సాధన. మూడు ఆ సాధన కోసం సమకూర్చుకొనే సామగ్రి నాలుగు ఆ సామగ్రి నుపయోగించుకొనే విధానం. అయిదు చివరికీ సాధన ద్వారా అందుకొనే ఫలితం. ఈ అయిదింటిలో బ్రహ్మాండమైన తేడా ఉంది రెండింటికీ. ఒక్కొక్క విషయమే ఇప్పు డాలోచిద్దాం.
జ్ఞానానికి లక్ష్యం వేరు. ధ్యానానికి లక్ష్యం వేరు. జ్ఞాని లక్ష్యం ఆత్మ స్వరూపమే మరేదీ గాదు. అందుకే అంతకాలేచ మామేవ - మామను స్మర - అలాగే మా మనుస్మర మామేవైష్యసి యోమాం స్మరతి అని విధి విరామం లేకుండా చెబుతూపోతుంది గీత. మామంటే నన్ను అని అర్థం. నన్నంటే ఆత్మ స్వరూపాన్నే. పరమాత్మ అయినా ఆత్మే. జీవాత్మ అయినా ఆత్మే. ఆత్మగా రెండుగావవి ఒక్కటే. అదే నీ జీవిత లక్ష్యమదే
Page 139