కవిం పురాణం - యదక్షర మని ఇంతవరకూ వర్ణించిన ఆ బ్రహ్మ స్వరూపాన్ని సగుణంగా ధ్యానించటాని కిది ఆలంబనంగా Support తోడుపడుతుంది ఉపాసకులకు. అయితే ఊరక ఓం ఓమని యాంత్రికంగా ఉచ్చరించటం కాదు. అంతవరకే అయితే అది అపేక్షితమైన ఫలాన్ని మనకంద జేయకపోవచ్చు. కనుకనే వ్యాహరన్ మా మనుస్మరన్ అంటున్నది గీత. ఓంకారం జపిస్తూ దాని అర్థాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి సాధకుడు. ఓంకారం శబ్దం మాత్రమే అర్ధం కాదు. దాని అర్ధం వేరే ఉంది. అది బ్రహ్మం. సోహమ్మని గదా ఓమంటే. ఆత్మ స్వరూపంగా బ్రహ్మతత్త్వాన్ని భావించటమే ఓంకారాని కసలైన అర్ధం.
యః ప్రయాతి త్యజన్ దేహం. ఎవడైతే అలాటి అర్థాన్ని నిత్యమూ మనసుకు తెచ్చుకొంటూ ప్రణవ జపం చేస్తూ మరణ సమయంలో దేహ త్యాగం చేసి వెళ్లిపోగలడో. సయాతి పరమాంగతిం - వాడే పరమపదమైన సగుణ బ్రహ్మ లోకాన్ని చేరగలడు. దాని కనుగుణమైన బ్రహ్మ సాయుజ్యం పొందగలడు. అసలైన పరబ్రహ్మం కాదిది. కార్యబ్రహ్మం. కనుకనే ఓంకారస్యోపాసనం కాలాంతర ముక్తి ఫలమని స్పష్టంగా చాటి చెప్పారు భగవత్పాదులు. సద్యోముక్తి దాయకం కాదు. క్రమముక్తి ప్రదమని అర్థం.
ఇప్పుడు మరలా ధ్యాన విషయాన్ని పక్కన బెట్టి జ్ఞాన విషయం ప్రస్తావించ బోతున్నాడు వ్యాసమహర్షి జ్ఞానం ధ్యానం రెండూ ఒక దాన్ని మార్చి ఒకటి వర్ణిస్తూనే ఉన్నాడాయన. ఇంతవరకూ వర్ణించాడిక మీదటా
Page 138