సంచారం లేకుండా నిశ్చలం చేయాలట. మూర్ధ్న్యాధాయ ఆత్మనః ప్రాణం. ఆపాటికి మనోబుద్ధులు రెండూ ప్రాణశక్తిలో చేరిపోతాయి. మనః ప్రాణే అని ఉపనిషత్తు. మనోబుద్ధులు జ్ఞాన శక్తి అయితే ప్రాణం క్రియా శక్తి. ఈ శక్తి ద్వయాన్ని ఉపాసకుడు సుషుమ్న ద్వారా శిరః ప్రదేశానికి తీసుకెళ్లాలట. ఆస్థితో యోగధారణాం. అక్కడ యోగంతో దాన్ని ధారణ చేయటానికి ఉద్యమించాలట యోగి.
అంత మాత్రమే కాదు. ఓమి త్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్. బ్రహ్మతత్త్వాని కొక అభిధాన మున్నది. అది ఏకాక్షరం. దానికే ఓమ్మని పేరు. ప్రణవమని కూడా అంటారు దాన్ని. అది బ్రహ్మ స్వరూపాన్ని అందుకోటానికి రెండు విధాలుగా పనికివస్తుంది. ఎవరికి. జ్ఞానులకు గాదు. ధ్యానులకు. ఒకటి వాచక రూపేణ మరొకటి ప్రతీక రూపేణ అని పేర్కొంటారు భగవత్పాదులు. వాచక మభిధాయక మంటే ఒక అర్థాన్ని చెప్పే శబ్దం. ప్రతీకమంటే ఒక రూపం. రెండూ బ్రహ్మానికుపాధులే. సంకేతాలే. ఇందులో వాచకమే నామం. ప్రతీకమే రూపం. నామరూపాలన్న మాట. బ్రహ్మం వస్తుతః నామరూప రహితమైనది. కాని మందమధ్యమ బుద్ధులు దాన్ని అలాగే అందుకోటానికి భయపడతారు. కాబట్టి వారి కోసమే ఆలంబనం. అదే ఓంకారం. సోహమ్మనే శబ్దమే సకార హకారాలు లోపించి ఓంకార మయిం దంటారు. సోహ మ్మంటే అదే నేను - నేను అదేనని భావం.
Page 137