చెప్పింది. కపాల రంధ్రమొకటి నాభి రంధ్ర మొకటి - రెండు తీసేస్తే పదకొండు తొమ్మి దవుతుంది. కలిపితే తొమ్మిది పడకొండవుతుంది. ఏదైతే నేమి. మొత్తం మీద బాహ్య విషయాలు మనసులోకి రావాలంటే ఇవి నిజంగా ద్వారాలే. ఇవి మన వశంలో లేకుంటే బహిర్ముఖంగానే పోతుంటాయి మన ఇంద్రియాలు. మాట వినవు. యోగి తన లక్ష్యాన్ని సాధించటాని కడ్డు పడతాయి. కాబట్టి వాటి రాకపోకల నరికట్టాలి మొదట. సర్వద్వారాణి సంయమ్య. తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. తరువాత మనోహృది నిరుధ్యచ. ఇంద్రియాల కంటే ప్రమాదకర మైనది మనస్సు. ఇవైనా బయటికి కనిపిస్తుంటాయి. అది అంత రింద్రియం. మనకు దాని ఆచూకీ తెలియ నివ్వదు. అదీ ఇదీ ఆలోచించటమూ తన్నిమిత్తంగా అదీ ఇదీ అనుభవిస్తూ కంగారు పడటమే దాని ఉద్యోగం. అలవాటు.
ఆ అలవాటు తప్పించాలంటే మనోవృత్తు లన్నింటినీ హృదయంలో ప్రవిలయం చేస్తూ పోవాలి. హృదయమంటే హృత్సయా బుద్ధ్యా అని అర్ధం చెప్పారు కఠోపనిష ద్భాష్యంలో గురువుగారు. హృదయమంటే బుద్ధి ఇక్కడ. మనసు వికల్పాత్మకమైతే అది నిర్వికల్పకం. నిశ్చయాత్మక మైనది. ఇంద్రియాల కన్నా సూక్ష్మమైనది మనస్సయితే అంతకన్నా సూక్ష్మతరమైనది బుద్ధి. మనసు కరణమైతే ఇది కర్తృరూప మైనది. విజ్ఞానమని గూడా దీనికి నామాంతరం. మనసు నలాటి బుద్ధిలో పెట్టటమంటే నిష్ప్రచార మాపాద్య అని పేర్కొంటారు స్వామివారు.
Page 136