రూపమైన ఆత్మజ్ఞానం లభిస్తేనే సుమా అందులో ప్రవేశించ గలిగేది అని హెచ్చరించాడు. అంటే ఎంత ధ్యానమైనా జ్ఞానంగా మారితేనే అక్షర ప్రవేశం. అంతవరకూ అది గౌణమే Secondary ముఖ్యార్ధంలో Primary కాదని గుర్తించాలి మనం.
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి అంతేకాదు. అలాటి అక్షర తత్త్వాన్ని ఎప్పటికైనా అందుకోవాలనే ఇచ్చతోనే గురుకులంలో శుశ్రూష చేస్తూ కాలం గడుపుతుంటా రనేక మంది. తత్తేపదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఈవిధంగా ఇంతమంది సాధకులింత బ్రహ్మ ప్రయత్నం చేసి చివరకు అందుకొనే ఆ బ్రహ్మ పదమెలా ఉంటుందో అన్ని భావాలూ పోగుచేసి సంగ్రహంగా నీకు బోధిస్తాను సావధానంగా విన మంటున్నాడు కృష్ణ భగవానుడు.
సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ
మూర్థ్యాధాయాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణామ్ - 12
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మా మనుస్మరన్
యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిమ్ - 13
ద్వారాలన్నీ తన అదుపులో ఉంచుకోవాలి మొదట సాధకుడు. ద్వారాణి ఉపలభేః అని అర్ధం వ్రాస్తున్నారు భాష్యకారులు. బాహ్యమైన విషయాలు లోపలికి తెచ్చుకొనే మార్గాలే ద్వారాలంటే. పురమేకాదశ ద్వారమని పదకొండూ అవి. అది కఠోపనిషత్తు చెప్పినవైతే గీత తొమ్మిదే
Page 135