లక్ష్యం. సతం ఉపైతి. ఈ ఉపాసకుడు దేహపాతమైన తరువాత ప్రయాణ మయిపోయి దాన్ని అందుకొంటాడు. దానితో తాదాత్మ్యం చెంది దాని ఐశ్వర్యాన్ని తానూ అనుభవిస్తాడట.
య దక్షరం వేద విదో వదంతి
విశంతి య ద్యతయో వీతరాగాః
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే - 11
ఇంతకూ అది ఏమిటి - ఈ యోగులందరూ యోగధారణతో వెళ్లి అందుకొనే ఆ స్థాన మెలాంటిదంటే మరలా దాన్ని వర్ణించి చెబుతున్నది గీత. కఠోపనిషత్తులోని శ్లోకానికిది దీటైన శ్లోకం. అర్ధం కూడా ఒకటే. యదక్షరం వేద విదో వదంతి. వేదార్థం బాగా తెలిసిన పెద్దలందరికీ వేదవిదు లని పేరు. వారందరూ దాన్ని అక్షరమని పేర్కొంటున్నారు. క్షరం కాని దేదో అది అక్షరమని చెప్పాం. ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండేదని అర్ధం. తద్వాఏత దక్షరం బ్రాహ్మణా అభివదంతి అని బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడీ అక్షర స్వరూపాన్నే వర్ణించి చెప్పాడు గార్గికి. విశంతి య ద్యత యో వీత రాగాః. వీత రాగులైన యోగీశ్వరు లంతా ఎంతో ధ్యానం చేసి చేసి చివరకు దేనిలో ప్రవేశిస్తారో అదీ ఆ అక్షరం. ధ్యానంతో ప్రవేశించగలరా అని అనుమానం వచ్చిందక్కడ భగవత్పాదులకు. అందుకే ఒక మాట ఇరికించా రిక్కడ. సమ్యగ్దర్శన ప్రాపౌ సత్యాం. సమ్యగ్దర్శన
Page 134