#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

నూట ఒక్కనాడులు హృదయానికి సంబంధించినవి. తాసాం మూర్ధాన మ భినిస్సృతైకా. వాటిలో కూడా ఒక్కటే ఉంది ముఖ్యమైన దది సుషుమ్న. ఆ నాడి మూర్ధం అంటే సహస్రారం వరకూ ప్రయాణం చేస్తుంది. మొట్టమొదట ఈ ఉపాసకుడు తన హృదయంలో తన మనశ్శక్తిని చేర్చుకొని త ఈః ఊర్ధ్వగా మిన్యా నాడ్యా భూమి జయక్రమేణ భ్రూవోర్మధ్యే ప్రాణమావేశ్య స్థాపయిత్వా సమ్యగ ప్రమత్తస్సన్ - తరువాత మనస్సుతో కలిసి ఉన్న తన ప్రాణశక్తిని సోపాన క్రమంగా పైకి తెచ్చుకొని భ్రూమధ్యంలో ప్రవేశపెట్టాలి. ఆ పెట్టటంలో సమ్యక్ చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఉంటే ఆ తరువాతనో. ఆ తరువాత ఏముంది. దాన్ని అక్కడి నుంచి లేపి సహప్రారంలో చేర్చి చివరకు కపాల భేదం చేసుకొని బయటికి వచ్చి అక్కడే ఉన్న సూర్యనాడిలో వాటితో సహా ప్రవేశించి సాధకుడైన జీవుడు సూర్యమండలం వరకూ వెళ్లి అది కూడా ఛేదించుకొని సత్యలోకం దాకా ప్రయాణించ వలసి ఉంటుంది.

  సత్యలోకంలో ఉన్నాడు తన ఉపాస్య దేవత. సగుణమైన బ్రహ్మమది. దాన్నే కార్య బ్రహ్మమనీ శబల బ్రహ్మమని కూడా పేర్కొంటారు వేదాంతులు. దానికొక లోకమూ రూపమూ ప్రభావమూ ఇన్ని ఉన్నాయి గుణాలు. అతణ్ణి కవిం పురాణమని ముందు శ్లోకాలలో వర్ణిస్తూ వచ్చింది గీత. పరమం పురుషం దివ్యం పరమ పురుషుడనీ - దివ్య పురుషుడనీ వర్ణించింది కూడా అతణ్ణి. అదే ఈ ఉపాసకుడి ఉపాసన కంతటికీ ఏకైక

Page 133

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు