డిక ఈ జీవుడే. జీవుడే మనసుగాదు. జీవుడే ప్రాణం కాదు. అవి రెండూ వీడి ఉపాధులు. మరి వీడో. వీడు కేవల చైతన్య స్వరూపుడు. కాని ఈ మనః ప్రాణాలనే ఉపాధులతో చేయికలిపి ఆ మేరకే పడిపోయిన చైతన్యమది. ఈశ్వర చైతన్యంలాగా విశుద్ధ మైనది గాదు. మలినం. కనుకనే ఈశ్వరుడికి దూరమై పోయింది. దూర మయింది కనుకనే మరలా దాన్ని అందుకోవాలని ఆరాట పడుతున్నది. అదే ఈ ప్రయాణం. అది ధ్యానమా జ్ఞానమా అనే విషయంలోనే తేడా. ధ్యానంతో చేస్తే అది సగుణం. జ్ఞానంతో అయితే నిర్గుణం. ఒకటి ప్రవృత్తి రూపమైతే ఇంకొకటి నివృత్తి రూపం. ఇది ఇంతకు ముందు నుంచీ వర్ణిస్తూనే వచ్చాము. ఈ అధ్యాయం సమాప్తమయ్యే టపుడింకా విపులంగా వర్ణించ బోతాము. తత్తావ దాస్తామ్. అధునా ధ్యాయినాం యత్ప్రయాణం తదభి వర్ణ్యతే.
మనస్సూ ప్రాణమే గదా సాధనాలని పేర్కొన్నాం. ప్రయాణానికి పూర్వమెలా ఉన్నా ప్రయాణ కాలంలో మాత్రమది దాని ఇష్టానుసారంగా ఉండటానికి లేదు. మనసా అచలేన. అచలమయి పోవాలది. ఏ విషయాల మీదికీ పరుగెత్త గూడదు. చెదరి పోగూడదు. ఒకే లక్ష్యం మీద నిలిచి ఉండాలి. అంతే గాదు. భక్త్యా యుక్తః - భక్తి అంటే పట్టుకోటం. యోగి తానే లక్ష్యాన్ని మనసులో పెట్టుకొన్నాడో దాన్నే అంటిపట్టుకొని కూచోవాలి. దానికే భక్తి అని పేరు. అలా కాకుంటే విభక్తమయి పోతుందది. అంతే కాదు. యోగ బలేన చైవ. యోగబలం కూడా సమృద్ధిగా ఉండాలి.
Page 131