కాదు. నిర్గుణం కాదు. సగుణంగా విస్తరించిన చైతన్యరూపం. దీనికే ఈశ్వరుడనీ అంతర్యామి అనీ పేరు పెట్టింది శాస్త్రం. వాడీశ్వరుడెప్పు డయ్యాడో వాడి పాలనలో ఉన్న మనబోటి జీవులందరూ వాడి అను శాసనాని కధీనులం కాక తప్పదు. అప్పటికిది ద్వైత భావనే గాని అద్వైత భావన కాదు. దేశకాల వస్తు భేదం చెప్పావంటే అది ఇంకా ద్వైతమే. వస్తుతంత్రంగా అది తన పాటికి తాను అద్వైతమే కావచ్చు. కాని బుద్ధి సిద్ధం గావటం లేదది సాధకుడికి. అది ఏదో ఎక్కడో ఉంది తనకు భిన్నంగా దాన్ని పోయి అందుకోవాలనే వాడి భావన. ఈ భావన వదలకుండానే ప్రయాణం చేస్తున్నా డిప్పుడు అవసాన కాలంలో ఉపాసకుడు.
ప్రయాణ కాలే మనసా చలేన
భక్త్యా యుక్తో యోగ బలేన చైవ
భ్రువో ర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్యక్
సతం పరం పురుష ముపైతి దివ్యమ్ -10
ప్రయాణ మనగానే దానికి కావలసిన సరకూ సరంజామా సమకూర్చు కోవాలి గదా. ఏమిటా సర కిక్కడ. భౌతికమైన ప్రయాణమైతే భౌతికమైన సామగ్రి. ఇది భౌతికం కాదు Material. భావికం Mental. కనుక మనస్సూ ప్రాణమూ ఇవి రెండే ఇక్కడ సామగ్రి. ఇందులో మనస్సు దారి చూపు తుంటుంది. ప్రాణం దారిలో సాగి పోతుంటుంది. అయినా ఇది కేవలం సామగ్రి అనే విషయం మరచిపోరాదు మనం. ఇది సామగ్రి అయితే దీన్ని వెంటబెట్టుకొని పోయే ప్రయాణికు డెవడు. ఎవడున్నా
Page 130