సర్వస్య ధాతారమ చింత్యరూప
మా దిత్య వర్ణం తమ సః పరస్తాత్ - 9
ఎలాటి పురుషుడీ ఉపాసకుడు ధ్యానించే దివ్య పురుషుడని ప్రశ్న వస్తే వర్ణిస్తున్నా డిప్పుడా పురుషుణ్ణి. కవిం పురాణం అను శాసితారం. కవి అంటే క్రాంత దర్శి. సర్వజ్ఞుడని అర్ధం. పురాణ అంటే సనాతనుడు. అను శాసితారం. జగత్తునంతా శాసించే వాడు. అణో రణీయాంసం. సూక్ష్మాతి సూక్ష్మమైన తత్త్వమది. సర్వస్య ధాతరం - ప్రాణు లందరికీ వారి వారి కర్మలూ వారి వారి కర్మల కనుగుణమైన ఫలాన్నీ పంచి పెట్టేవాడు. అచింత్య రూపం. నియతంగా ఒకరూప మనేది ఉన్నప్పటికీ అది ఈ లౌకికమైన పదార్ధాల లాగా మనసుతో ఊహించేది గాదు. ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్. అజ్ఞానమే తమస్సు. చీకటి. దానికి పరస్తాత్ అతీతంగా వెలుగుతున్న సూర్యప్రకాశంలాటి నిత్యచైతన్య ప్రకాశమది.
వర్ణన వింటే బాగానే ఉంది. ఇదే గదా ఆత్మ ఇంతకన్నా విశేష మేముందని తోస్తుంది. వాస్తవమే. సర్వజ్ఞమే సనాతనమే సూక్ష్మాతి సూక్ష్మమే అచింత్యమే ఆదిత్య వర్ణమే శుద్ధచైతన్య స్వరూపమే ఆత్మ కూడా. సందేహం లేదు. కాని సర్వస్య ధాతారం - తమసః పరస్తా త్తనటంలో తేడా వస్తున్నది. నామరూపాలే తమస్సు దానికి అతీతంగా ఉన్నదని చెప్పటం. అలా ఉంటూ ఈ జీవకోటి నంతా శాసిస్తున్నది వీటి కర్మలన్నిటికీ సాక్షి అయి వీరికా కర్మఫలాన్ని అందజేస్తుందని ఎప్పుడన్నామో అప్పుడది సర్వవ్యాపకం
Page 129