#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

సూక్ష్మశరీరం. మరణం స్థూలానికేగాని సూక్ష్మానికి లేదు. అందులో కూచొని ఆయా దేవలోకాలకు ప్రయాణమై పోతాడు. అక్కడ ఉంటాడు తాను ధ్యానిస్తూ వచ్చిన దేవత. దాన్ని పోయి వాటేసు కొంటాడీ ఉపాసకుడు. అది తనకు ప్రసాదించే ఐశ్వర్యమేదో అది అనుభవానికి వస్తుందీ ఉపాసకుడికి. అంతే కాదు. అది అనుభవించిన తరువాత మరలా ఆలోకాన్ని వదిలేసి ఈ కర్మ భూమికి తిరుగు ప్రయాణం చేయవలసిందే తప్పదు. ఇంత ఉంది ఉపాసకుడి వ్యవహారం. పోతే జ్ఞాని కిలాటి గొడవ ఏదీ లేదు. వాడికి త్రివిధ శరీరాలూ ఇక్కడే లయమై పోతాయి. అశరీరి వాడు. వాడు పట్టుకొన్న దాత్మ తత్త్వం గదా. అది అశరీర మయినప్పుడు దాన్ని పట్టుకొన్న వాడూ అశరీరే. అది సర్వవ్యాపకం గనుక వాడూ సర్వ వ్యాపకుడే. సర్వమూ అదే అయినప్పు డిక లోకాలు లేవు దేవత లేదు. అక్కడికి ప్రయాణం లేదు. దానితో సాయుజ్యం లేదు. మరలా పునరావృత్తి అనే ప్రశ్నా లేదు. కనుకనే మయ్యర్పిత మనోబుద్ధి అన్నది గీత. మనస్సు బుద్ధి ఇదే గదా సూక్ష్మ శరీరం. ఇది ఆత్మకే అర్పితమయి తదాకారంగా మారినప్పు డిక ఎందులో కూచొని ప్రయాణమై పోవాలి జ్ఞాని. కాబట్టి జ్ఞాని ఎప్పుడూ ముక్తుడే. పోతే ఉపాసకు డలా సద్యోముక్తుడు కాడు. క్రమముక్తుడు. ఆ క్రమమే ఇక్కడ వర్ణిస్తున్నాడు వేదవ్యాసుడు.

కవిం పురాణ మను శాసితార
మణో రణీయాంస మనుస్మరేద్యః

Page 128

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు