మరలా గుర్తు చేసుకోటమే. పోతే ధ్యాని విషయమలా లేదు. వీడి లక్ష్యం సర్వత్రా లేదు. ఏదో ఒకానొక చోట ఉన్న ఒకానొక పదార్ధం. దాని లాగా నిరాకారం కాదిది. సాకారం. తన కనన్యం కాదు. అన్యం. ఆత్మ లాగా వస్తుసిద్ధం being కాదు. సాధ్యం becoming కొత్తగా అందుకో వలసింది. ఇంత ఉంది తారతమ్యం.
అదే వివరిస్తున్నాడు మహర్షి పరమం పురుషం దివ్యం యాతి పార్ధాను చింతయన్. ధ్యాత అయినవాడు చింతించ వలసిందీ చింతిస్తూ కూచునేది సర్వవ్యాపకమైన ఆత్మచైతన్యం కాదు. దాని విభూతి. పరమమైనదీ పూర్ణమైనదీ అది. అన్నిటి కన్నా శ్రేష్ఠమైనది. అన్నిటిలాగా ఏ కొంతమేరో గాక చాలామేర వ్యాపించి ఉన్నది. పైగా దివ్యం. దివి సూర్యమండలే భవం దివ్యమని అర్ధం వ్రాశారు గురువుగారు. దివి అంటే ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యమండలం. ఆ మండలమనే ఉపాధి ద్వారా అభివ్యక్త Manifest మవుతున్న నారాయణ స్వరూపం. అదీ పరమ పురుషు డన్నా దివ్య పురుషు డన్నా. ఉపాసకుడి పాలిటి కదే పరమాత్మ. అదే వాడి ఏకైక లక్ష్యం. దాన్నే ధ్యేయంగా పెట్టుకొని ధ్యానిస్తుంటాడు. వాడు. చివరకు మరణానంతరం తన అభ్యాసాని కనుగుణంగా వెళ్లి అలాటి నారాయణ స్వరూపంతోనే తాదాత్మ్యం చెందుతాడు.
ఇక్కడ ఇంకా ఒక సూక్ష్మముంది మనం గ్రహించవలసింది. ఉపాసకుడికి స్థూల శరీరమిక్కడ పతనమైనా మరొక శరీర ముంది
Page 127