గామిగా మార్చుకోవాలి. ఆత్మాభిముఖంగా తిప్పాలి. ఆత్మ లక్షణాలే ఆలోచిస్తూ కూచుంటే ఆత్మ వైపే మళ్లుతుందది. ఏది అలవాటు చేస్తే అదే ఆలోచిస్తుంది మనసు. బలమైనా అదే. బలహీనత అయినా అదే దానికి. అందులో అనాత్మ భావన దానికి బలహీనత అయితే ఆత్మ భావన అంతకంతకు బలమిస్తుంది.
అప్పుడనాత్మ వృత్తులు క్రమంగా సమసిపోయి ఆత్మైకవృత్తే నిండిపోతుంది మనసులో. అదే అభ్యాసమంటే. వ్రాస్తున్నారు చూడండి భగవత్పాదులు. చిత్త సమర్పణ విషయభూతే ఏకస్మిన్ తుల్య ప్రత్యయా వృత్తి లక్షణః విలక్షణ ప్రత్యయానంత రితః అభ్యాసః - సచాభ్యా సోయోగః మనసుతో ఏది ఆలోచించాలను కొన్నాడో ఆ లక్ష్యం మీదనే చిత్తవృత్తిని పదే పదే నిలుపుతూ పోవాలి. దానికి విజాతీయమైన ప్రాపంచిక వృత్తులేవైనా వస్తుంటే వాటితో ఈ వృత్తి మరుగు పడకుండా చూచుకోవాలి. ఇదే అభ్యాసం ఇదే యోగమని ధ్యాన మార్గాన్ని వర్ణిస్తున్నా డాయన. అయితే ఒక మాట. జ్ఞాన సాధన అయినా ఇలాంటిదే గదా ఇక ధ్యానానికీ జ్ఞానానికీ తేడా ఏముందని పిస్తుంది మనకు. బ్రహ్మాండమైన తేడా ఉంది. విమర్శించి చూస్తే. ఒకే లక్ష్యం పెట్టుకొని సాధన చేయట మనేంత వరకూ రెంటికీ సమానమే అయినా ఆ లక్ష్యమనేది సర్వత్రా పరుచుకొని నిరాకారంగా ఉంది జ్ఞానికి. అది కూడా తన కన్యంగా ఎక్కడో లేదు. తన స్వరూపమే. క్రొత్తగా సాధించేది గాదది. సిద్ధమైనదే మరచిపోయి
Page 126