సాక్షి చైతన్యంగా మారిపోతాయి. పోతే మామే వైష్యస్య సంశయః - సాక్షినైన నేనే అయిపోతాడు జ్ఞాని. వాడికీ నాకూ తేడా లేదని హామీ ఇస్తున్నాడు పరమాత్మ. ఇలాటి ఏకాత్మ జ్ఞానమే అసలైన ఆత్మజ్ఞానం. ఇదే నిరంతర స్మృతి వల్ల సిద్ధించే మహాఫలం. సంసార క్లేశాలన్నీ దీనివల్ల తొలగిపోతాయి. స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః అని ఛాందోగ్యం మనకు చేస్తున్న ఉపదేశమిదే.
అభ్యాస యోగ యుక్తేన - చేతసా నాన్యగా మినా
పరమం పురుషం దివ్యం యాతి పార్ధాను చింతయన్ - 8
సద్యోముక్తి దాయకమైన జ్ఞాన మార్గాన్ని ఇలా వర్ణించి మరలా దానికి తోడ్పడే ధ్యాన మార్గాన్ని కూడా ఏకరువు పెడుతున్నది గీత. చెప్పాము గదా గర్భశత్రువులు కావివి రెండూ ఒకదాని కొకటి ఉపకార్యోప కారకాలని. అందుకే చెబుతున్నారు మరలా మధ్యమాధికారుల కోసం ధ్యాన స్వరూపాన్ని, ఆత్మజ్ఞాన మనేది మొదటనే నీకు లేకపోయినా అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగా మినా. అభ్యాస మనేది చేస్తూ పోతే ఎప్పటికో ఒకప్పటి కుదయించకుండా పోదు నీ మనస్సుకు. మనసే గదా దేనినైనా సాధించ వలసింది. అటు జ్ఞానానికైనా అదే. ఇటు ధ్యానానికైనా అదే. అయితే ఎంత గొప్ప సాధనమైనా మనస్సు ఇటూ అటూ చెదిరిపోతుంటే సుఖం లేదు. అనాత్మ విషయాల నెప్పుడూ ఆలోచిస్తూ పోవటం దాని కలవాటు. అది తప్పించాలి సాధకుడు. అన్యగామి కాకుండా దానినాత్మ
Page 125