#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

అది ఆ వెలుగులో చేరి వెలుగుగా మారటం లేదా. కారణం. అది వెలుగు తాలూకు ఆభాస. అలాగే నామరూపాలన్నీ సచ్చిత్తుల ఆ భాసే గనుక సచ్చిదాకారమైన ఆత్మను నిరంతరమూ భావించే కోద్దీ అవి అంతకంతకు తేలిపోతూ అనాత్మ అంతా చీకటి లాగా విరిసిపోయి ఆత్మగానే దర్శనమిస్తుంది చివరకు. ఇదే అనాత్మతో మనం చేయవలసిన యుద్ధం. సాధించవలసిన విజయం. అనులోమంగా ఆత్మను స్మరిస్తూ పోవటమే ప్రతిలోమంగా అనాత్మ భావాన్ని విస్మరించటం. ఈ విస్మరణమే యుద్ధమని భంగ్యంతరంగా చెప్పింది భగవద్గీత.

  అయితే ఇది నిరంతరమూ చేయాలి. ఎప్పుడు సడలిపోతే అప్పుడు రెడీగా ఉంటుంది అనాత్మ భావన చీకటిలాగా లోపల ప్రవేశించటానికి. మనసూ బుద్ధీ ఇవతల ఒంటరిగా ఉన్నంతవరకూ వాటికెక్కడ లేని బలం. వచ్చి నెత్తిన బడతాయి అనాత్మ భావాలు. కాబట్టి వాటికి రక్షణ కల్పించాలి. ఎలాగ. వికల్పాత్మకమైన మనసునూ సంకల్పాత్మకమైన బుద్ధినీ రెంటినీ వృత్తిరూపంగా కాక ఏవృత్తీ లేని సాక్షి చైతన్యంలో ప్రవేశపెట్టాలి. మయ్యర్పిత మనోబుద్ధిః అంటే అర్ధమదే. వృత్తిజ్ఞానం విశేషమైతే వృత్తిరహితమైన సాక్షి సామాన్య జ్ఞానం. అది ఈ వృత్తులనూ వృత్తిలో ప్రతిఫలించిన నామరూపాలనూ అన్నిటినీ అంటి ముట్టకుండా వాటినే వ్యాపించి సాక్షిగా దర్శిస్తుంటుంది. అలాటి సాక్షినే సుమా నేనని ఆత్మ భావనతో చూస్తూపోతే అందులోనే చేరిపోతాయి చిత్తవృత్తులన్నీ. వృత్తులు

Page 124

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు