దేవతా సాయుజ్యం. సగుణ బ్రహ్మో పాసన చేస్తే హిరణ్యగర్భ సాయుజ్యం. అలాగే నిర్గుణమైన సర్వవ్యాపకమైన ప్రత్యగభిన్నమైన పరమాత్మనే భావిస్తూపోతే పరమాత్మ భావమే సిద్ధిస్తుంది. సందేహ మేముంది. నాస్త్యత్ర సంశయః అని ఇంతకు పూర్వమే హామీ ఇచ్చాడుగా భగవానుడు. ఇప్పుడూ అదే ఇస్తున్నాడు అసంశయః అని. అయితే కండిష నేమిటో తెలుసా. మా మనుస్మర. స్మరిస్తూ పోవటమే. కేవల స్మరణ కూడా కాదది. అనుస్మరణ. అను అంటే మాటి మాటికీ మాటి మాటికీ దేనికి. మధ్యలో అప్పుడప్పుడు తెగిపోయే ప్రమాదముంది. తెగుతుంటే ముడి పెట్టుకొంటూ పోవాలి. తెగటం ప్రారబ్ధం కొద్దీ అయితే ముడి పెట్టుకొంటూ పోవటం పురుష ప్రయత్నం. అదే అనుస్మృతి అనుసంధాన మనే మాటల కర్ధం. ఎందుకంటే సర్వేషు కాలేషు అనుస్మర అంటున్నాడు భగవానుడు. సర్వకాల సర్వావస్థ లన్నప్పుడిక మధ్యలో మరొక ఆలోచన కవకాశమే లేదు. ఎప్పుడూ అదే చింతన.
అయితే అలా చింతన చేస్తూ కూచోటం సాధ్యమా. సాధ్యం కాదు. మధ్యలో తెగి పోతుంటుంది. ఎందుకని. ప్రారబ్దవశాత్తూ స్నాన పానభోజనాదులూ లోకులతో సంవ్యవహారమూ జరుగుతుండాలి గదా. అలా జరుగు తున్నప్పుడీ చింతన తెగిపోక తప్పదు. అందుకే స్మరణ గాకుండా అనుస్మరణ అని చెప్పటం. తెగుతుంటే మరలా ముడిపెట్టుకొంటూ పోవటమే జ్ఞానసాధకుడు చేయవలసిన పని. మరి
Page 121